- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ ఫేమస్ ప్లాన్ తొలగింపుపై క్లారిటీ ఇచ్చిన జియో..
భారతదేశంలో జియో నెట్ వర్క్ వచ్చిన తర్వాత ఇంటర్నెట్ ధరలు అతి తక్కువకు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి.

దిశ, వెబ్‌డెస్క్: భారతదేశంలో జియో నెట్ వర్క్ వచ్చిన తర్వాత ఇంటర్నెట్ ధరలు అతి తక్కువకు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. దీంతో దేశవ్యాప్తంగా కోట్లాదిమంది జియో యూజర్లుగా మారిపోయారు. అయితే ఇటీవల మారిన నిబంధనలు, నష్టాలను పుచ్చుకోవడానికి అన్ని టెలికాం సంస్థలు రీఛార్జ్ ధరలను పెంచాయి. దీంతో లక్షలాది మంది యూజర్లు నెట్ వర్క్ లను మార్చుకొని చౌకధరలకే ప్లాన్లు అందుబాటులో ఉన్న బీఎస్ఎన్ఎల్ వంటి నెట్ వర్క్‌కు మారిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా జియో నెట్‌వర్క్ ఫేమర్ రీఛార్జ్ ప్లాన్ అయిన రూ. 249, 799 ప్లాన్‌లను తొలగించిందని వార్తలు ప్రచారం అయ్యాయి. ఈ వార్తలపై జియో నెట్ వర్క్ స్పందిస్తూ.. రూ. 799 ప్లాన్ దేశ వ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యంలో ఉందని అలాంటి ప్లాన్ ను తొలగించడం లేదని క్లారిటీ ఇచ్చింది. అలాగే ఈ ప్లాన్ ఇప్పటికే అన్ని పేమెంట్ యాప్‌లలో అందుబాటులో ఉందని యూజర్లు ఎప్పటిలాగే ఈ ప్లాన్‌ను రీఛార్జ్ చేసుకొవచ్చని జియో క్లారిటీ ఇచ్చింది. రూ. 799 తో అందుబాటులో ఉంటే ఈ ప్లాన్‌లో రోజుకు 1.5 జీబీ డేటా, అన్ లిమిటెడ్ కాల్స్.. 84 రోజుల వ్యాలిడిటీ వస్తుంది. దీంతోనే ఈ ప్లాన్ ను దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది యూజర్లు వినియోగించుకుంటారు.






