- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జియో రూ.249 ప్లాన్‌కు గుడ్ బై.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న బేసిక్ ప్లాన్ వివరాలు ఇవే
జియో నెట్‌వర్క్ టెలికాం రంగంలో దేశంలో ప్రస్తుతం నంబర్ వన్ స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. జియో మొదట చాలా తక్కువ ధరకే ప్లాన్స్ తీసుకురావడంతో స్టార్ట్ ఫోన్ ప్రియులంతా జియో నెట్ వర్క్‌కు పోర్ట్ అయ్యారు.

దిశ, వెబ్ డెస్క్: జియో నెట్‌వర్క్ టెలికాం రంగంలో దేశంలో ప్రస్తుతం నంబర్ వన్ స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. జియో మొదట చాలా తక్కువ ధరకే ప్లాన్స్ తీసుకురావడంతో స్టార్ట్ ఫోన్ ప్రియులంతా జియో నెట్ వర్క్‌కు పోర్ట్ అయ్యారు. కానీ యూజర్లు అలవాటుపడ్డాక ఇప్పుడు జియో మెల్లిగా ప్లాన్స్ ధరలను పెంచుతోంది. తాజాగా నెలవారీ బేసిక్ ప్లాన్ రూ.249ను కూడా ఎత్తేసింది. ఈ ప్లాన్‌లో రోజుకు 1జీబీ డేటా, అపరిమిత కాలింగ్ తో పాటు ఇతర ప్రయోజనాలు అందేవి.
ఈ ప్లాన్ రద్దు చేయడంతో జియో బేసిక్ టారిఫ్ ప్లాన్ ధర రూ.50 పెరిగింది. దీంతో ఇప్పుడు జియో బేసిక్ ప్లాన్ రూ.299కి వస్తోంది. ఈ ప్లాన్ ధర నెలకు రూ.50 యాబై మాత్రమే ఎక్కువ అయినప్పటికీ రోజుకు 1.5జీబీ డేటా వస్తోంది. అంతే కాకుండా 5జీ నెట్ వర్క్ రావడం వల్ల వినియోగదారులు వేగంగా ఇంటర్నెట్ వినియోగించుకోవచ్చు. దీంతో పాటు జియో టీవీ, జియో క్లౌడ్ సబ్ స్క్రిప్షన్ ఉచితంగా ఉంది. నెలకు మొత్తం 42 జీబీ డేటా లభిస్తోంది. ఈ ప్లాన్‌లోనే నెలకు 100 ఎస్ఎంఎస్‌లు ఉచితంగా పంపుకునే అవకాశం ఉంది.






