ఇదేం పోటి నాయన.. రిహాన్నాను తెచ్చిన అంబానీ.. అదానీ ఏకంగా ఆ స్టార్‌నే కుమారుడి పెళ్ళికి పట్టుకొస్తున్నారట?

by Vennela |

Adani Son Jeet Adani wedding: గత ఏడాది భారత అపర కుబేరుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ వివాహం ఘనంగా జరిగిన విషయం తెలిసిందే.

ఇదేం పోటి నాయన.. రిహాన్నాను తెచ్చిన అంబానీ.. అదానీ ఏకంగా ఆ స్టార్‌నే కుమారుడి పెళ్ళికి పట్టుకొస్తున్నారట?
X

Adani Son Jeet Adani wedding: గత ఏడాది భారత అపర కుబేరుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ వివాహం ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ప్రీవెడ్డింగ్, వెడ్డింగ్, ఆశీర్వాద్ అని ఇలా ఎన్నో వేడుకలు జరిగాయి. ఇప్పుడు గౌతమ్ అదానీ కుమారుడి వివాహం గురించి ఒకటే చర్చ నడుస్తోంది.

దిగ్గజ వ్యాపారవేత్త, భారత్ లోనే రెండవ అత్యంత ధనవంతుడు గౌతమ్ అదానీ చిన్న కుమారుడు జీత్ అదానీ, ప్రీ వెడ్డింగ్ కోసం భారత్ కు రానున్నట్లు సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. సాధారణంగానే పాప్ సింగర్స్ కు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. వీళ్లు చేసే కాన్సర్ట్స్ కు లక్షల్లో..కోట్లలో వసూలు చేస్తుంటారు. వీరికి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా భారీగానే ఉంటుంది. అందుకే వీరితో పెద్ద పెద్ద ఈవెంట్లలో స్పెషల్ ప్రోగ్రామ్స్ చేస్తుయింటారు. ఈ క్రమంలోనే ఇప్పుడు టేలర్ స్విఫ్ట్ పేరు వినిపిస్తోంది.

గౌతమ్ అదానీ రెండో కుమారుడు జీత్ అదానీ వివాహం ఫిబ్రవరి 7వ తేదీన జరగనుంది. తాజాగా దీనిపై మహాకుంభమేళాలో ఉన్న గౌతమ్ అదానీ స్పష్టతను ఇచ్చారు. అదానీ మాత్రం తన కుమారుడి పెళ్లి సాదాసీదాగా జరుగుతుందని..పూర్తిగా సంప్రాదయ పద్ధతిలోనే జరుగుతుందని వెల్లడించారు. మరోవైపు ఇదే సమయంలో ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ మాత్రం గ్రాండ్ గా కళ్లు చేదిరేలా నిర్వహించనున్నట్లు పలు జాతీయ మీడియాలు కథనాలను రాస్తున్నాయి.

అయితే ఫ్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో టాప్ పాప్ సింగర్ టేలర్ స్విఫ్ట్(Pop singer Taylor Swift)) ఆడిపాడనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆమె ప్రదర్శన గురించి టేలర్ స్విప్ట్ టీమ్ తో అదానీలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. ఆమె వచ్చే వరకు ఇలాంటి వాటిపై స్పష్టత ఉండదని చెప్పుకోవచ్చు.

కాగా గౌతమ్ అదానీ చిన్న కుమారుడు జీత్ అదానీకి (Jeet Adani వెడ్డింగ్)2023 మార్చిలోనే డైమండ్ ట్రేడర్ జైమిన్ షా కుమార్తె దివా జైమిన్ షాతో ఎంగేజ్ మెంట్ అయ్యింది. పెళ్లి ఈ ఏడాది ఫిబ్రవరి 7వ తేదీన జరగనుంది. ఈ క్రమంలోనే పెళ్లికి ఏర్పాట్ల గురించి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. గత ఏడాది రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ వివాహం ఎంతో వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వివాహానికి 5వేల కోట్లు ఖర్చు చేసినట్లు తెలిసిందే. ఆ సమయంలో పాప్ సింగర్ రిహాన్న ప్రత్యేక ప్రదర్శన ఇచ్చేందుకు భారత్ వచ్చింది. ఇప్పుడు అదానీ ఇంట పెళ్లికి టేలర్ స్విఫ్ట్ వస్తారన్న ప్రచారం జోరుగా జరుగుతోంది.

Next Story