Japan Companies: 'చైనా ప్లస్ వన్' వ్యూహంలో భాగంగా భారత్‌పై జపాన్ కంపెనీల దృష్టి

by S Gopi |

చైనాకు ప్రత్యామ్నాయంగా ఇతర దేశాల్లో తయారీ ప్లాంట్‌లను ఏర్పాటు చేయడంపై కంపెనీలు దృషి సారించాయి.

Japan Companies: చైనా ప్లస్ వన్ వ్యూహంలో భాగంగా భారత్‌పై జపాన్ కంపెనీల దృష్టి
X

దిశ, బిజినెస్ బ్యూరో: కోవిడ్ -19 మహమ్మారి తత్వాత జపాన్ కంపెనీలు చైనాపై ఆధారపడటాన్ని క్రమంగా తగ్గిస్తున్నాయి. ఇందులో భాగంగా తమ తయారీ, సరఫరా వ్యవస్థలో 'చైనా ప్లస్ వన్' వ్యూహాన్ని అనుసరించాలని భావిస్తున్నాయి. ఇందుకు భారత్‌కు కీలక కేంద్రంగా చూస్తున్నాయని డెలాయిట్ నిపుణులు తెలిపారు. చైనాకు ప్రత్యామ్నాయంగా ఇతర దేశాల్లో తయారీ ప్లాంట్‌లను ఏర్పాటు చేయడంపై కంపెనీలు దృషి సారించాయి. దీనివల్ల భారత్ ఎక్కువ లబ్ది పొందనుంది. కొవిడ్ పరిస్థితుల తర్వాత కొన్ని జపాన్ కంపెనీలు సొంత దేశానికి తిరిగి వెళ్లగా, మరికొన్ని భారత్‌కు తయారీ కేంద్రంగా ఎంపిక చేస్తున్నాయి. కేవలం తయారీ కేంద్రంగానే కాకుండా మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా లాంటి ఎక్కువ వృద్ధి అవకాశాలు ఉన్న మార్కెట్లకు భారత్ ఒక గేట్‌వేగా ఉంటుందనే ఆలోచన కంపెనీల్లో ఉందని డెలాయిట్ సీఈఓ కెనిచి కిమురా చెప్పారు. భారత మార్కెట్ ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా, ఇప్పటికే స్థిరపడిన వ్యాపారం, టాలెంట్ నెట్‌వర్క్ తమ వ్యాపారాలకు భారత మార్కెట్ మరింత సామర్థ్యాన్ని ఇవ్వగలదు. దీన్ని ఉపయోగించుకోవాలని, తద్వారా మన దేశ మార్కెట్ అవకాశాలతో పాటు అంతర్జాతీయ సరఫరాకు కేంద్రంగా మార్చుకోవాలని ఆశిస్తున్నాయి.

ఇటీవల జపాన్ ప్రభుత్వం వారి దేశంలోనే కాకుండా ఆగ్నేయాసియాల్లో ఉత్పత్తి పెంచేందుకు, వారి కంపెనీలను ప్రోత్సహించేందుకు భారీగా నిధులను కేటాయించడం కూడా ఈ మార్పునకు సంకేతంగా చూడవచ్చు. మన దేశ స్థానిక మార్కెట్, తక్కువ కార్మికుల ఖర్చులను పరిగణలోకి తీసుకుని కార్యకలాపాలను విస్తరించే పనిలో పడ్డాయి. 'చైనా ప్లస్ వన్ ' వ్యూహం జపాన్ కంపెనీలను భారత్‌లో అవకాశాలు, పెట్టుబడులు పెట్టేందుకు ఎక్కువ ప్రేరేపిస్తున్నాయని డెలాయిట్ దక్షిణాసియా సీఈఓ రోమల్ శెట్టి తెలిపారు. తాజా జపాన్ ఎక్స్‌టర్నల్ ట్రేడ్ ఆర్గనైజేషన్(జెట్రో) డేటా ప్రకారం, జపనీస్ ఎఫ్‌డీఐలు చైనాను భారత్‌లో గణనీయంగా పెరిగాయని సూచిస్తున్నాయి. చైనాకు వెళ్లే జపాన్ ఎఫ్‌డీఐలు 13 బిలియన్ డాలర్ల నుంచి 3 బిలియన్ డాలర్లకు తగ్గాయి. భారత్‌కు వచ్చే ఎఫ్‌డీఐలు 6 బిలియన్ డాలర్లు ఉన్నాయి. చైనాను అధిగమించి ఎక్కువ జపాన్ ఎఫ్‌డీఐలు భారత్‌లోకి రావడం ఇదే తొలిసారి.

Next Story