- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
JLR: ఈవీ తయారీ నుంచి తప్పుకున్న జాగ్వార్ ల్యాండ్ రోవర్
మాతృసంస్థ టాటా మోటార్స్ తన ఫ్యాక్టరీలో ఈవీ తయారీ ప్రణాళికలను రద్దు చేసినట్టు సంబంధిత వ్యక్తులు తెలిపారు.

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ, టాటా యాజమాన్యంలోని జాగ్వార్ ల్యాండ్ రోవర్(జేఎల్ఆర్) ఎలక్ట్రిక్ వాహనాల తయారీ నిర్ణయాన్ని విరమించుకుంది. కంపెనీ మాతృసంస్థ టాటా మోటార్స్ తన 1 బిలియన్ డాలర్ల ఫ్యాక్టరీలో ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) తయారీ ప్రణాళికలను రద్దు చేసినట్టు సంబంధిత వ్యక్తులు తెలిపారు. స్థానికంగా ఈవీల తయారీకి అవసరమైన విడిభాగాలను సేకరించడంలో సమస్యలు ఉండటం, వాటి ధర-నాణ్యతలో వ్యత్యాసం కారణంగా కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. దీనికితోడు గత కొద్దిరోజులుగా ఈవీ కార్లకు డిమాండ్ నెమ్మదించడం కూడా ప్రభావితం చేసింది. భారత్‌లో జేఎల్ఆర్ ఈవీలకు సంబంధించి దాదాపు రెండు నెలల నుంచే అన్ని పనులు ఆగిపోయాయి. చైనా కంపెనీల నుంచి గట్టి పోటీ ఉండటం, హైబ్రిడ్ వాహనాలకు డిమాండ్, ఉద్గార నిబంధనలు, ఈవీ అమ్మకాల కోసం చాలా దేశాలు సానుకూలంగా మద్దతిస్తున్న నేపథ్యంలో జేఎల్ఆర్ ఈవీలకు మారడంపై వెనుకడుగు వేసింది. అంతేకాకుండా జేఎల్ఆర్‌పై దృష్టి సారించడం వల్ల తన వాహన తయారీ బ్రాండ్ టాటా మోటార్స్‌కు చెందిన ఈవీ విభాగంలో కొత్త మోడళ్లను తీసుకురావడంలో ఆలస్యమవుతుందని కంపెనీ భావించింది. ఈవీ ప్రణాళికలపై గతేడాది నవంబర్‌లో జేఎల్ఆర్ ముంబైలోని స్థానిక సరఫరాదారులతో సమావేశాన్ని నిర్వహించింది. ప్రధానంగా స్థానిక విడిభాగాల ధరలు, లభ్యతపై కంపెనీ ఆరా తీసింది. ఆ తర్వాత చర్చలు తాత్కాలికంగా నిలిచిపోయాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
READ MORE ...






