- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ITR గడువు పొడగింపు
ITR గడువు మరోసారి పొడగిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది.

దిశ, వెబ్ డెస్క్ : ITR గడువు మరోసారి పొడగిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ఈ ఏడాది ITR జులై 31 లోపు ఫైల్ చేయాల్సి ఉండగా.. వివిధ కారణాలతో సెప్టెంబర్ 15 వరకు పొడిగిస్తున్నట్టు పేర్కొంది. ఐటీఆర్ ఫారాల్లో చేసిన మార్పులు, ఫైలింగ్ సిస్టమ్‌లో కొత్త అప్‌డేట్స్, TDS క్రెడిట్ చూపడంలో ఆలస్యం వంటి కారణాలతో చాలా మంది సమయానికి ఫైల్ చేయలేక.. గడువు పెంచమని కేంద్రానికి భారీగా వినతులు చేశారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని గడువును పెంచుతున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. ఈ పొడిగింపు వల్ల చిన్న ఆదాయం ఉన్నవాళ్లు, జీతం తీసుకునేవాళ్లు, చిన్న వ్యాపారం చేసేవాళ్లు ఒత్తిడి లేకుండా సెప్టెంబర్ 15 లోపు ఫైల్ చేయవచ్చు.
ఒకవేళ ఈ గడువు కూడా మిస్ అయితే డిసెంబర్ 31, 2025 వరకు ఆలస్య రిటర్న్ ఫైల్ చేయవచ్చు. అయితే దీనికి రూ.1,000 నుంచి రూ.5,000 వరకు ఫైన్ కట్టాల్సి ఉంటుంది. ఈ గడువు పొడిగింపు గురించి CBDT అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి. అప్పటివరకు వివరాలు సిద్ధం చేసుకుని https://www.incometax.gov.in/ వెబ్‌సైట్‌లో ఫైల్ చేయడానికి రెడీ అవ్వొచ్చని నిపుణులు తెలుపుతున్నారు.






