2047 నాటికి అందరికీ బీమా: ఐఆర్‌డీఏఐ ఛైర్మన్!

by Disha Web Desk 17 |
2047 నాటికి అందరికీ బీమా: ఐఆర్‌డీఏఐ ఛైర్మన్!
X

న్యూఢిల్లీ: 2047 నాటికి దేశంలోని అందరికీ బీమా అందించేందుకు నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏఐ చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు బీమా నియంత్రణ సంస్థ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఐఆర్‌డీఏఐ) ఛైర్మన్ దెబాసిష్ పాండా గురువారం ప్రకటనలో తెలిపారు.

పరిశ్రమల సమాఖ్య సీఐఐ నిర్వహించిన సమావేశంలో మాట్లాడిన ఆయన, 2047 నాటికి భారత్‌కు 100 ఏళ్ల స్వాతంత్య్రం పూర్తవుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని '2047 నాటికి అందరికీ బీమా' అనే కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం. దీనికోసం అవైలబిలిటీ, యాక్సెసబిలిటీ, అఫర్డబిలిటీ అనే మూడు అంశాల ప్రాధాన్యతగా పని చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే ఐఆర్‌డీఏఐ గత 10-12 నెలల్లో లైఫ్ కవర్ ప్లాన్‌ల విస్తరణ, అవగాహన కోసం చర్యలు మొదలుపెట్టిందని దెబాసిష్ పాండా చెప్పారు.

చెల్లింపుల వ్యవస్థలో యూపీఐ విధానం తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పు తరహాలో బీమా రంగంలోనూ తెచ్చేందుకు జీవిత, సాధారణ బీమా కౌన్సిల్‌లతో చర్చిస్తున్నాం. ఒక నిర్మాణాత్మకమైన ఫ్రేమ్‌వర్క్ గురించి చర్చలు జరుగుతున్నాయి. ఈ ఫ్రేమ్‌వర్క్ బీమా విస్తార్, బీమా సుగం, స్త్రీల ఆధారిత బీమా వాహక్ వంటి అంశాల ఆధారంగా రూపొందించబడుతుంది. మార్కెట్ పరిమాణం, తక్కువ బీమా వ్యాప్తి కారణంగా దేశీయ బీమా రంగంలో పెట్టుబడులకు అపారమైన అవకాశాలు ఉన్నాయన్నారు.


Next Story

Most Viewed