బీమా రంగంలో టెక్నాలజీ పరిష్కారాలకు ఐఆర్‌డీఏఐ ఆహ్వానం!

by Disha Web Desk 7 |
బీమా రంగంలో టెక్నాలజీ పరిష్కారాలకు ఐఆర్‌డీఏఐ ఆహ్వానం!
X

న్యూఢిల్లీ: బీమా నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏఐ పాలసీదారుల ప్రయోజనాలను కాపాడే లక్ష్యంలో భాగంగా టెక్నాలజీతో కూడిన వినూత్న పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి కంపెనీలను ఆహ్వానించింది. ఆటోమెటెడ్ డెత్ క్లెయిమ్ సెటిల్‌మెంట్, తప్పుడు బీమా ఉత్పత్తుల అమ్మకాలను తగ్గించడం వంటి బీమా రంగంలోని అంశాలకు సంబంధించి సమస్యలను పరిష్కరించే టెక్నాలజీ కోసం ఐఆర్‌డీఏఐ తన హ్యాకథాన్-బీమా మంథన్-2022 కార్యక్రమంలో భాగంగా ఇన్నోవేషన్ ఇన్ ఇన్సూరెన్స్ థీమ్‌ కోసం దరఖాస్తులను ఆహ్వానించింది.

టెక్నాలజీని ఉపయోగించి పాలసీదారుల ప్రయోజనాలను రక్షించడం ద్వారా ప్రతి వ్యక్తికి ఇబ్బందుల్లేని, వేగవంతమైన పద్దతిలో బీమా ప్రయోజనాలను అందుబాటులోకి తెచ్చే సామర్థ్యాన్ని అభివృద్ధి చేయాలని కంపెనీలను నియంత్రణ సంస్థ కోరింది. అలాగే, బీమా చేయని మోటార్ వాహనాలను గుర్తించడం, తప్పనిసరి మోటార్ థర్డ్ పార్టీ బీమాను, ఇప్పటికీ బీమా సౌకర్యం లేని ప్రాంతాలకు సేవలందించే టెక్నాలజీ ఆధారిత పరిష్కారాలను ఐఆర్‌డీఏఐ ఆశిస్తోంది. టెక్నాలజీని ఉపయోగించి మోటార్ బీమాలో మోసాలను నివారించవచ్చని ఐఆర్‌డీఏఐ భావిస్తోంది.

స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అధిక వడ్డీతో ఎస్‌బీఐ కొత్త ఎఫ్‌డీ పథకం!

Next Story

Most Viewed