- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
HUL: సర్ఫ్, డవ్ సహా ఉత్పత్తుల ధరలు పెంచిన హెచ్‌యూఎల్
ముడి పదార్థాలు, ప్యాకేజింగ్ ఖర్చుల భారం కారణంగా సబ్బులు, టీపొడుల ధరలను రూ. 1 నుంచి రూ. 20 వరకు పెంచినట్టు తెలిపింది.

దిశ, బిజినెస్ బ్యూరో: ఎఫ్ఎంసీజీ దిగ్గజం హిందూస్తాన్ యూనిలీవర్(హెచ్‌యూఎల్) వివిధ రకాల ఉత్పత్తుల ధరలను పెంచుతున్నట్టు గురువారం ప్రకటించింది. పెరుగుతున్న ముడి పదార్థాలు, ప్యాకేజింగ్ ఖర్చుల భారం కారణంగా సబ్బులు, టీపొడుల ధరలను రూ. 1 నుంచి రూ. 20 వరకు పెంచినట్టు తెలిపింది. ముఖ్యంగా డవ్, లిరిల్, పియర్స్ సబ్బుల ధరలను రూ. 2-3 మేర పెంచింది. ఈ పెంపు తర్వాత 100 గ్రా. డవ్ సీరమ్ రూ. 60కి, డవ్ పింక్ రూ. 70కి, పియర్స్ రూ. 45కి, లిరిల్ రూ. 41కి చేరింది. వీటితో పాటు రెడ్ లేబుల్, సర్ఫ్ ధరలు కూడా హెచ్‌యూఎల్ పెంచింది. సర్ఫ్ ధరను బరువును బట్టి రూ. 5-20, రెడ్ లేబుల్ ధరను రూ. 2-10 మధ్య పెంచింది. ముఖ్యంగా పశ్చిమాసియాలో యుద్ధం ప్రభావం కారణంగా సబ్బుల తయారీలో కీలకమైన పామాయిల్, ప్లాస్టిక్‌ల ధరలు గణనీయంగా పెరిగాయి. ధరల పెరుగుదలకు తోడు సరఫరా, రవాణా, ఇంధన ఖర్చులు కూడా ఇందుకు కారణమని కంపెనీ పేర్కొంది.






