Iphone: ఐఫోన్ ఎస్ఈ4 విడుదల చేసిన యాపిల్

by S Gopi |

తెలుపు, నలుపు రంగుల్లో లాంచ్ చేయగా, 128జీబీ, 256జీబీ, 512జీబీ వేరియంట్లలో లభిస్తుంది.

Iphone: ఐఫోన్ ఎస్ఈ4 విడుదల చేసిన యాపిల్
X

దిశ, బిజినెస్ బ్యూరో: గ్లోబల్ టెక్ దిగ్గజం యాపిల్ సంస్థ తన ఐఫోన్ పోర్ట్‌ఫోలియోలోని చవకైన మోడల్ ఐఫోన్‌ను బుధవారం విడుదల చేసింది. కొత్త ఐఫోన్ 16 సిరీస్‌లో భాగంగా 16ఈ పేరుతో తీసుకొచ్చారు. ఏ18 చిప్‌తో విడుదలైన ఈ ఫోన్ ఇతర ఐఫోన్ సిరీస్‌ల తరహాలోనే యాపిల్ ఇంటిలిజెన్స్‌తో పనిచేస్తుంది. తెలుపు, నలుపు రంగుల్లో లాంచ్ చేయగా, 128జీబీ, 256జీబీ, 512జీబీ వేరియంట్లలో లభిస్తుంది. దీని ధర రూ. 59,900 నుంచి ప్రారంభవుతుంది. ఐఫోన్ ఎస్ఈ4 కోసం ఫిబ్రవరి 21 నుంచి ప్రీ-ఆర్డర్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. సాధారణ అమ్మకాలు ఫిర్బవరి 28 నుంచి మొదలవుతాయని వెల్లడించింది. ఫీచర్లకు సంబంధించి అధునాతన గేమింగ్ ఫీచర్లు అందించేందుకు ఇందులో 4-కోర్ జీపీయూని ఉపయోగించారు. అంతేకాకుండా మెషిన్ లెర్నింగ్ మోడల్ వేగవంతంగా పనిచేసేందుకు చిప్ 16-కోర్ న్యూరల్ ఇంజిన్, యాపిల్ ఇంటిలిజెన్స్‌ను సపోర్ట్ చేస్తుంది. డిజైన్ పరంగా 6.1 అంగుళాల సూప్ర రెటీనా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ ప్యానెల్‌తో 48ఎంపీ ఫ్యూజన్ కెమరా, 4కె వీడియోలను కూడా క్యాప్చర్ చేస్తుంది. ఇందులో యాక్షన్ బటన్ కూడా ఉంది. ఇది యాపిల్ ఇంటిలిజెన్స్ పవర్డ్ విజువల్ ఇంటిలిజెన్స్ ఫీచర్‌కు యాక్సెస్ అందిస్తుంది. 48 మెగాపిక్సెల్ రిజల్యూషన్‌తో ఒకేఒక వెనుక కెమెరా ఉన్న మొట్టమొదటి ఐఫోన్ మోదల్ ఇదని కంపెనీ తెలిపింది.

Next Story