Iphone 16: ఐఫోన్ 16పై భారీ డిస్కౌంట్.. రూ. 57,000కే కొనేయొచ్చు

by S Gopi |

గతేడాది విడుదలైన ఐఫోన్ 16 విజయ్ సేల్స్‌లో భారీ తగ్గింపుతో లభిస్తోంది.

Iphone 16: ఐఫోన్ 16పై భారీ డిస్కౌంట్.. రూ. 57,000కే కొనేయొచ్చు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా పండుగ సీజన్ దాదాపుగా ముగిసినప్పటికీ, కొన్ని ఆఫర్లు ఇంకా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ప్రీమియం స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఐఫోన్‌లపై డీల్స్ ఫ్యాన్స్ కోసం ఇప్పటికీ అలాగే ఉన్నాయి. ముఖ్యంగా గతేడాది విడుదలైన ఐఫోన్ 16 విజయ్ సేల్స్‌లో భారీ తగ్గింపుతో లభిస్తోంది. ఇది యాపిల్ ఫ్యాన్స్‌కు పండుగ సీజన్ సేల్‌లో భాగంగా అందిస్తోంది. అయితే, ఈ ఆఫర్ ఎంతకాలం ఉంటుందనే విషయంపై స్పష్టత లేదు. ఆఫర్ విషయానికి వస్తే.. దేశీయ మార్కెట్లో రూ. 79,900 ధరలో విడుదలైన ఐఫోన్ 16, విజయ్ సేల్స్‌లో కేవలం రూ. 66,490కి అందుబాటులో ఉంది. అంటే ఈ ఫోన్ రూ. 13,410 తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. ఈ తగ్గింపు ప్రయోజనం అక్కడితో అయిపోలేదు, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉన్నవారు అదనంగా ఈఎంఐ లావాదేవీలపై 5 శాతం( రూ. 10,000 వరకు) ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. దీనివల్ల ధర రూ. 56,490కి తగ్గుతుంది. మొత్తంగా ఐఫోన్ 16పై రూ. 23,410 ఆదా అవుతుంది. ఒకవేళ పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ ద్వారా మార్చుకోవాలనుకుంటే, ఈ ధర మరింత తగ్గుతుంది.

Next Story