- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Stock Market: మార్కెట్ల ర్యాలీతో మదుపర్లకు రూ. 7 లక్షల కోట్ల లాభాలు
ఫిబ్రవరిలో భారత సేవల రంగం కార్యకలాపాలు గణనీయంగా పెరగడం, కీలక ఐటీ, మెటల్ రంగాల షేర్లలో కొనుగోళ్లతో సెంటిమెంట్ బలపడింది

దిశ, బిజినెస్ బ్యూరో: భారత ఈక్విటీ మార్కెట్లు వరుస నష్టాల నుంచి బయటపడ్డాయి. గత నెల రోజుల వ్యవధిలో అధిక సింగిల్-డే ర్యాలీని సూచీలు నమోదు చేశాయి. భారీ లాభాల కారణంగా బుధవారం ఇన్వెస్టర్ల సంపద ఒక్కరోజే రూ. 7.21 లక్షల కోట్లు పెరిగింది, తద్వారా బీఎస్ఈ మార్కెట్ క్యాప్ రూ. 392.28 లక్షల కోట్లకు చేరుకుంది. నిఫ్టీ వరుసగా పది రోజుల నుంచి బయటపడింది. గ్లోబల్ మార్కెట్ల నుంచి లభించిన మద్దతుకు తోడు, ముడి చమురు ధరలు దిగిరావడం, ఆసియా మార్కెట్లు సానుకూలంగా ఉండటం, భారత కరెన్సీ రూపాయి పుంజుకోవడం వంటి అంశాలు లాభాలకు కారణమయ్యాయి. ప్రధానంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడా, మెక్సికోలపై 25 శాతం పన్నును వెనక్కి తీసుకోవచ్చని యూఎస్ వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ ఫాక్స్, ప్రపంచ వాణిజ్యంలో భారత వాటా తక్కువ కాబట్టి , పరస్పర సుంకం ప్రభావం భారత్‌పై ఎక్కువగా ఉండకపోవచ్చని నిపుణులు అభిప్రాయపడటం ఇన్వెస్టర్లలో సానుకూల సంకేతాలనిచ్చింది. దీనికి తోడు దేశీయంగా ఫిబ్రవరిలో భారత సేవల రంగం కార్యకలాపాలు గణనీయంగా పెరగడం, కీలక ఐటీ, మెటల్ వంటి రంగాల షేర్లలో కొనుగోళ్ల జోరుతో మదుపర్ల సెంటిమెంట్ బలపడింది. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 740.30 పాయింట్లు ఎగసి 73,730 వద్ద, నిఫ్టీ 254.65 పాయింట్లు లాభపడి 22,337 వద్ద ముగిశాయి. నిఫ్టీలో మెటల్, ఆటో, పీఎస్‌యూ బ్యాంక్, ఐటీ రంగాలు రాణించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో అదానీ పోర్ట్స్, టాటా స్టీల్, పవర్‌గ్రిడ్, ఎంఅండ్ఎం, ఎన్‌టీపీసీ, టెక్ మహీంద్రా, టాటా మోటార్స్ షేర్లు అధిక లాభాలను సాధించాయి. బజాజ్ ఫైనాన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, జొమాటో స్టాక్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 87.05 వద్ద ఉంది.






