- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Stock Market: రూ. 4 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద
లిస్టెడ్ కంపెనీల సంపద బీఎస్ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.469 లక్షల కోట్ల నుంచి రూ.473 లక్షల కోట్లకు పెరిగింది

దిశ, బిజినెస్ బ్యూరో: అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై సానుకూలత, ప్రధాన కంపెనీల షేర్లలో కొనుగోళ్ల కారణంగా దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుసగా మూడవ సెషన్‌లో లాభాలను కొనసాగించాయి. ముఖ్యంగా త్వరలో వాణిజ్య ఒప్పందం జరుగుతుందని, భారత్‌పై సుంకాలు తగ్గిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన మార్కెట్ల సెంటిమెంట్‌ను పెంచాయి. మరోవైపు బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ అధికారాన్ని సొంతం చేసుకుంటుందనే సంకేతాలు మరింత ఊతమిచాయి. ఈ క్రమంలోనే కీలక ఐటీ, ఆటో రంగాల షేర్లు పుంజుకోవడంతో ఇన్వెస్టర్ల సంపద రూ. 4 లక్షల కోట్లకు పైగా పెరిగింది. తద్వారా లిస్టెడ్ కంపెనీల సంపదగా పరిగణించే బీఎస్ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.469 లక్షల కోట్ల నుంచి రూ.473 లక్షల కోట్లకు పెరిగింది. బుధవారం మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 595.19 పాయింట్లు లాభపడి 84,466 వద్ద, నిఫ్టీ 180.85 పాయింట్లు పెరిగి 25,875 వద్ద ముగిశాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఏషియన్ పెయింట్, టెక్ మహీంద్రా, టీసీఎస్, బజాజ్ ఫిన్‌సర్వ్, అదానీ పోర్ట్స్, హెచ్‌సీఎల్ టెక్ షేర్లు అధిక లాభాలను సాధించాయి. టాటా స్టీల్, టీఎంపీవీ, టీఎంసీవీ, బీఈఎల్ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 88.61 వద్ద ఉంది.






