- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Instagram: ఇన్‌స్టా సేవలకు అంతరాయం
ప్రముఖ టెక్ దిగ్గజం మెటా సంస్థకు చెందిన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఇన్‌స్టాగ్రామ్' సేవల్లో అంతరాయం ఏర్పడింది.

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ టెక్ దిగ్గజం మెటా (Meta) సంస్థకు చెందిన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఇన్‌స్టాగ్రామ్ (Instagram)' సేవల్లో అంతరాయం ఏర్పడింది. సాంకేతిక సమస్యల కారణంగా అమెరికాలో (USA) చాలా మంది వినియోగదారులు (Users) ఇన్‌స్టా సేవల్లో సమస్యలు ఎదుర్కొన్నారు. గురువారం సాయంత్రం (అమెరికా కాలమానం ప్రకారం) నుంచి లాగిన్, సర్వర్ కనెక్షన్ వంటి సమస్యలు తలెత్తాయి.
ప్రముఖ టెక్ ట్రాకింగ్ వెబ్ సౌట్ డౌన్ డిటెక్టర్ (Downdetector) ప్రకారం 72 శాతం శాతం కంటే ఎక్కువ మంది యూజర్లు యాప్‌లోకి లాగిన్ అవ్వడంలో సమస్యలు ఎదుర్కోగా.. 24 శాతం మంది సర్వర్ కనెక్షన్ ప్రాబ్లమ్‌ను నివేదించారు. దీంతో యూజర్లు గురయ్యారు. తమకు కలిగిన అంతరాయాన్ని పలువురు ఇన్‌స్టా యూజర్లు మరో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్' ద్వారా పంచుకున్నారు. అయితే, ఇన్‌స్టాగ్రామ్ సేవలు నిలిచిపోవడంపై మెటా ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం.






