- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Infosys: ఈ ఏడాది 20,000 మంది ఫ్రెషర్ల నియామకం
త్రైమాసిక పరంగా ఉద్యోగుల సంఖ్య కొద్దిగా తగ్గినప్పటికీ, గత ఏడాదితో పోలిస్తే సుమారు 5,000 మంది పెరిగారు.

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పెద్ద ఎత్తున ఫ్రెషర్ల నియామకాలు చేపట్టనునట్లు వెల్లడించింది. ప్రస్తుత ఏడాది జనవరి-మార్చి త్రైమాసిక ఫలితాల సందర్భంగా కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జయేశ్ సంఘ్‌రాజ్కా ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ ఏడాది మొత్తం 20,000 మంది వరకు ఫ్రెషర్లను తీసుకుంటామని తెలిపారు. త్రైమాసిక పరంగా ఉద్యోగుల సంఖ్య కొద్దిగా తగ్గినప్పటికీ, గత ఏడాదితో పోలిస్తే సుమారు 5,000 మంది పెరిగారు. ఈ త్రైమాసికంలో ప్రాజెక్టులు తక్కువగా ఉండటంతో పని కూడా తగ్గింది. అయితే, అదే సమయంలో సంస్థలో ఫ్రెషర్లు ఎక్కువగా ఉండటంతో ఉద్యోగుల సంఖ్యను బ్యాలెన్స్ చేయాల్సి వచ్చిందని జయేశ్ వివరించారు. కాగా, సమీక్షించిన త్రైమాసికంలో ఇన్ఫోసిస్ 20.8 శాతం వృద్ధితో రూ.8501 కోట్ల నికర లాభాలను ప్రకటించింది. కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం 13.4 శాతం పెరిగి రూ.46,402 కోట్లు వచ్చినట్లు కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. ఈ ఏడాది మార్చి నాటికి ఇన్ఫోసిస్‌లో మొత్తం ఉద్యోగుల సంఖ్య 3,28,594గా ఉంది.






