- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
IIP Data: 10 నెలల కనిష్ట స్థాయికి పారిశ్రామికోత్పత్తి
సమీక్షించిన నెలలో మైనింగ్ కార్యకలాపాలు 8.7 శాతం క్షీణించాయి

దిశ, బిజినెస్ బ్యూరో: భారత పారిశ్రామికోత్పత్తి వృద్ధి(ఐఐపీ) జూన్ నెలలో 10 నెలల కనిష్ఠ స్థాయి 1.5 శాతానికి పరిమితమైంది. రుతుపవనాలు ముందస్తుగానే రావడంతో పాటు భారీ వర్షపాతం, మైనింగ్, విద్యుత్తు రంగాల్లో పేలవ ప్రదర్శన వల్ల ఐఐపీ తగ్గిందని జాతీయ గణాంక కార్యాలయం (ఎన్‌ఎస్‌ఓ) సోమవారం ప్రకటనలో వెల్లడించింది. 2024 జూన్ నెలలో ఐఐపీ 4.9 శాతం వృద్ధి నమోదు చేసిన సంగతి తెలిసిందే. 2024 ఆగస్టులో ఐఐపీలో ఎలాంటి వృద్ధి నమోదు కాలేదు. ఎన్ఎస్ఓ గణాంకాల ప్రకారం.. సమీక్షించిన నెలలో మైనింగ్ కార్యకలాపాలు 8.7 శాతం క్షీణించాయి. గతేడాది ఇదే నెలలో కనిపించిన 10.2 శాతం వృద్ధికి తాజా డేటా పూర్తి వ్యతిరేక దిశలో ఉంది. విద్యుదుత్పత్తి కూడా గతేడాది జూన్‌లో 8.6 శాతం పెరిగితే, గత నెలలో 2.6 శాతం తగ్గింది. ఇక, ఐఐపీలో కీలకమైన తయారీ రంగం జూన్‌లో 3.9 శాతం వృద్ధిని చూసింది. గతేడాది ఇదే నెలలో నమోదైన 3.5 శాతం కంటే కూడా ఈసారి కొంచెం పెరిగింది. రుతుపవనాలు ముందుగా రావడంతో కొన్ని రంగాల్లో ఉత్పత్తి కార్యకలాపాలు నెమ్మదించడం వల్లే జూన్ నెలలో పారిశ్రామికోత్పత్తి వృద్ధి బలహీనపడిందని ఇక్రా ప్రధాన ఆర్థికవేత్త అదితి నాయర్ పేర్కొన్నారు.






