- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

X
దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ పారిశ్రామికోత్పత్తి (ఐఐపీ) ఈ ఏడాది సెప్టెంబర్‌లో 4 శాతం వృద్ధి నమోదు చేసింది. తయారీ రంగంలో మెరుగైన పనితీరే ఇందుకు కారణం. గతేడాది ఇదే నెలలో ఐఐపీ వృద్ధి 3.2 శాతం పెరిగింది. దేశంలో పండుగ సీజన్ సమయానికి కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ సంస్కరణలు డిమాండ్‌ను పెంచాయి, తద్వారా కీలక రంగాల బలహీన ఉత్పత్తిని తయారీ రంగం ఊతమిచ్చింది. నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ (ఎన్ఎస్ఓ) మంగళవారం విడుదల చేసిన డేటా ప్రకారం, సమీక్షించిన నెలలో తయారీ రంగం ఉత్పత్తి 4.8 శాతంగా నమోదైంది. గనుల రంగ ఉత్పత్తి 0.2 శాతం, విద్యుదుత్పత్తి 3.1 శాతం పెరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య కాలంలో దేశ పారిశ్రామిక ఉత్పత్తి 3 శాతం పెరిగింది. గత 2024-25 ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో ఇది 4.1 శాతంగా ఉంది.
Next Story






