- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Indigo: ప్రపంచంలోనే అత్యంత విలువైన విమానయాన సంస్థగా ఇండిగో
ప్రపంచ టాప్-10 ఎయిర్‌లైన్స్‌లో ఇండిగో మాత్రమే భారత్‌కు చెందిన విమానయాన సంస్థ.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో అరుదైన ఘనత సాధించింది. మార్కెట్ విలువ ప్రకారం ప్రపంచంలోనే అత్యంత విలువైన విమానయాన సంస్థగా నిలిచింది. బుధవారం కంపెనీ షేర్ ధర రూ. 5,262.5 గరిష్ఠ స్థాయికి చేరుకోవడంతో సంస్థ మార్కెట్ క్యాప్ 23.24 బిలియన్ డాలర్ల(రూ. 2.02 లక్షల కోట్ల) కు చేరింది. ఇది అమెరికాకు చెందిన డెల్టా ఎయిర్‌లైన్స్ మార్కెట్ క్యాప్ 23.17 బిలియన్ డాలర్ల(రూ. 2 లక్షల కోట్ల) కంటే స్వల్పంగా ఎక్కువ. ఈ మేరకు బ్లూమ్‌బర్గ్ డేటా పేర్కొంది. ప్రపంచ టాప్-10 ఎయిర్‌లైన్స్‌లో ఇండిగో మాత్రమే భారత్‌కు చెందిన విమానయాన సంస్థ. ఏవియేషన్ అనలిటిక్స్ సంస్థ సిరియమ్ డేటా ప్రకారం.. ఇండిగో వారానికి 15,768 విమానాలను నడుపుతోంది. గతేడాదితో పోలిస్తే విమానాల సంఖ్య 12.7 శాతం పెరిగాయి. దేశీయంగా పెరుగుతున్న విమాన ప్రయాణానికి తగినట్టుగా డిమాండ్ తీర్చేందుకు ఇండిగో ఇప్పటికే ఎయిర్‌బస్ నుంచి 500 నారో బాడీ ఏ320 నియో ఫ్యామిలీ ప్లేన్‌ల కొనుగోలు కోసం ఒప్పందం కుదుర్చుకుంది. ఇండిగోతో పాటు టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ఇండియా కూడా ఎయిర్‌బస్ నుంచి 250, బోయింగ్ నుంచి 220 మొత్తంగా 470 విమానాల కోసం ఆర్డర్ చేసింది. దేశీయ ప్యాసింజర్ విమానాల మార్కెట్లో ఇండిగో, ఎయిర్ఇండియా మాత్రమే 90 శాతానికి పైగా వాటా కలిగి ఉన్నాయి.






