- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇండిగో షేర్లు ఢమాల్
గత కొద్దిరోజులుగా ఇండిగోలో తీవ్ర సంక్షోభం నెలకొన్న సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : గత కొద్దిరోజులుగా ఇండిగోలో తీవ్ర సంక్షోభం నెలకొన్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా వందలాది విమానాలు రద్దవడం, ఆలస్యం కావడం వంటి సమస్యలు తలెత్తడంతో వేలాదిమంది ప్రయాణికులు ఇబ్బందులు పడగా.. స్వయంగా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఈ వ్యవహారంతో నేడు ఇండిగో షేర్ మార్కెట్ విలువ భారీగా పడిపోయింది. ఇండిగో మాతృసంస్థ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ షేర్లు గత ఐదు సెషన్లలో 9%కుపైగా పడిపోయాయి.
ఇక సోమవారం ట్రేడింగ్ ప్రారంభంలోనే 7% పతనం కావడంతో ఇన్వెస్టర్స్ తలలు పట్టుకున్నారు. అయితే డీజీసీఏ కొత్త ఎఫ్‌డీటీఎల్ నిబంధనలకు ఇండిగో సిద్ధం కాకపోవడంతో వందలాది విమానాలు రద్దు కావడం, సర్వీసుల్లో తీవ్ర అంతరాయం ఏర్పడడం షేర్ ధరలపై తీవ్ర ప్రభావం చూపిస్తోందని నిపుణులు చెబుతున్నారు. అయితే సోమవారం నుంచి పరిస్థితి మెరుగవుతుందని చెప్పిన ఇండిగో.. నేడు మరో 400 విమానాలను రద్దు చేయడం గమనార్హం.






