- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
IndiGo: ధరలు పెంచేసిన ఇండిగో.. ఏకంగా రూ. 10 వేల పెంపు
టికెట్లపై వసూలు చేసే ఫ్యూయెల్ ఛార్జీలను పెంచేసింది. ఇది దేశీయ, అంతర్జాతీయ రూట్లను బట్టి రూ. 275 నుంచి రూ. 10 వేల వరకు ఉండటం గమనార్హం.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో భారీగా ధరలు పెంచేసింది. గ్లోబల్ మార్కెట్లో ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్(ఏటీఎఫ్) ధరలు అత్యధికంగా పెరగడంతో కంపెనీ టికెట్లపై వసూలు చేసే ఫ్యూయెల్ ఛార్జీలను పెంచేసింది. ఇది దేశీయ, అంతర్జాతీయ రూట్లను బట్టి రూ. 275 నుంచి రూ. 10 వేల వరకు ఉండటం గమనార్హం. కొత్త ధరలు ఏప్రిల్ 2(ఈరోజు) నుంచే అమల్లోకి వస్తాయని అధికారిక ప్రకటనలో ఇండిగో స్పష్టం చేసింది. సంస్థ అధికారిక వివరాల ప్రకారం, ఇంధన ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నామని, దేశీయ రూట్లలో విమాన ప్రయాణ దూరాన్ని బట్టి శ్లాబ్ ఆధారిత ఇంధన ఛార్జీల విధానాన్ని ప్రవేశపెట్టామని తెలిపింది. 500 కి.మీ., వరకు ఉన్న మార్గాలకు అదనంగా రూ. 275 చెల్లించాలి, 2,000 కి.మీ.,కు పైన సుదీర్ఘ మార్గాలకు రూ. 950 ఇంధన ఛార్జీ వర్తిస్తుంది. మధ్యస్థ దూరాలకు ఛార్జీలు రూ. 400-800 వరకు ఉంటాయని వివరించింది. అంతర్జాతీయ రూట్లలో భారత ఉపఖండంలోని ప్రయాణాలకు రూ. 900-2,500 వరకు ఛార్జీలు ఉంటాయి. గల్ఫ్, మిడిల్ఈస్ట్ రూట్లలో రూ. 5,000 వరకు, యూరప్‌తో సహా సుదూర మార్గాల్లో ఇంధన ఛార్జీలు రూ. 10,000 వరకు అమలు చేస్తున్నట్లు పేర్కొంది.






