- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
IndiGo: ఇండిగో కొత్త ఛైర్మన్‌గా మాజీ ఐఏఎస్ విక్రమ్ సింగ్ మెహతా
వెంకటరమణి సుమంత్రన్ పదవీ విరమణ చేస్తున్న కారణంగా ఆయన స్థానంలో విక్రమ్ మెహతా నియమితులవుతారు.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ బడ్జెట్ విమానయాన సంస్థ ఇండిగో ఎయిర్‌లైన్స్ బుధవారం సంస్థ ఛైర్మన్‌గా విక్రమ్ సింగ్ మెహతాను నియమించింది. మూడేళ్ల క్రితం బాధ్యతలు స్వీకరించిన వెంకటరమణి సుమంత్రన్ పదవీ విరమణ చేస్తున్న కారణంగా ఆయన స్థానంలో విక్రమ్ మెహతా నియమితులవుతారు. మాజీ ఐఏఎస్ అధికారి అయిన మెహతా, దేశంలో షెల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఛైర్మన్, ఈజిప్టులోని షెల్ మార్కెట్స్, షెల్ కెమికల్స్ సీఈఓతో సహా కీలక పదవులను నిర్వహించారు. ఆయన అనేక కంపెనీలకు బోర్డు సభ్యుడిగా కూడా ఉన్నారు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ నుంచి గణితంలో డిగ్రీని, ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం నుంచి రాజకీయాలు, ఆర్థిక శాస్త్రం, టఫ్ట్స్ యూనివర్శిటీ నుంచి ఎనర్జీ ఎకనామిక్స్‌లో కలిపి రెండు మాస్టర్ డిగ్రీలు అందుకున్నారు. 2022 నుంచి ఇండిగో మాతృ సంస్థ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్‌లో బోర్డు సభ్యుడిగా విక్రమ్ సింగ్ మెహతా ఉన్నారు. కాగా, బోర్డు సభ్యుడిగా ఐదేళ్ల పదవీకాలం పూర్తయిన నేపథ్యంలో వెంకటరమణి సుమంత్రన్ ఆ పదవికి రాజీనామా చేసినట్టు కంపెనీ బుధవారం ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది. 2022, మే నెలలో బోర్డు ఛైర్మన్‌గా నియమితులైన సుమంత్రన్, కోవిడ్-19 మహమ్మారి నుంచి సంస్థ ఎదుగుదలకు, గణనీయమైన వృద్ధికి అవసరమైన కీలక చర్యలు తీసుకున్నారని పేర్కొంది.






