- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
WPI Inflation: మేలో 14 నెలల కనిష్టానికి టోకు ద్రవ్యోల్బణం
ఆహార, ఇంధన ధరలు పడిపోవడంతోనే గణనీయమైన తగ్గుదలే ఇందుకు ప్రధాన కారణం.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో టోకు ద్రవ్యోల్బణం భారీగా దిగొచ్చింది. వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డేటా ప్రకారం, భారత టోకు ధరల సూచీ (డీబ్ల్యూపీఐ) ద్రవ్యోల్బణం మే నెలలో 14 నెలల కనిష్టానికి పడిపోయి 0.39 శాతానికి చేరింది. అంతకుముందు ఏప్రిల్‌లోనూ డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం 0.85 శాతంగా నమోదైంది. గతేడాది మేలో 2.74 శాతంగా ఉంది. ఆహార, ఇంధన ధరలు పడిపోవడంతోనే గణనీయమైన తగ్గుదలే ఇందుకు ప్రధాన కారణం. ముఖ్యమైన వస్తువుల హోల్‌సేల్ ధరల కదలికలను ట్రాక్ చేసేందుకు డబ్ల్యూపీఐ సూచీ కీలకమైన కొలమానం. దీనివల్ల దేశంలో ధర ఒత్తిళ్లు ఆర్థికవ్యవస్థ వృద్ధికి ఎలా దోహదపడుతున్నాయనే అంశాన్ని పరిశీలించవచ్చు. సమీక్షించిన నెలలో ఆహార ద్రవ్యోల్బణం 2.55 శాతం నుంచి 1.72 శాతానికి దిగొచ్చింది. కూరగాయల ధరల్లోనూ ప్రతిద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో 18.26 శాతం నుంచి 21.62 శాతానికి తగ్గాయి. ఉల్లి, బంగాళాదుంపలు, పప్పుధాన్యాల వంటి ప్రధానమైన ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం ఇందుకు ఎక్కువ సహకరించాయి. ఇంధన, విద్యుత్ విభాగం మాత్రం 2.18 శాతం నుంచి 2.27 శాతానికి స్వల్పంగా పెరిగింది. తయారీ వస్తువుల హోల్‌సేల్ ధరలు 2.62 శాతం నుంచి 2.04 శాతానికి పడిపోయాయని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ పేర్కొంది.






