Cash: క్యాష్ ఈజ్ కింగ్

by S Gopi |

గతేడాదితో పోలిస్తే ఇది 11.8 శాతం పెరిగింది. అంతేకాకుండా 2017 తర్వాత ఇదే అత్యధికం.

Cash: క్యాష్ ఈజ్ కింగ్
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో నగదు వినియోగం మళ్లీ పుంజుకుంటోంది. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో తొలి 15 రోజుల్లో చలామణిలో ఉన్న కరెన్సీ రూ. 610 బిలియన్ మేర పెరిగి మొత్తం విలువ రూ. 42.3 లక్షల కోట్లకు చేరుకుంది. గతేడాదితో పోలిస్తే ఇది 11.8 శాతం పెరిగింది. అంతేకాకుండా 2017 తర్వాత ఇదే అత్యధికం. దేశీయంగా ఆర్థిక కార్యకలాపాలు తిరిగి బలపడుతున్న సంకేతాలకు ఈ గణాంకాలు రుజువూని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ పెరుగుదల వెనుక ముఖ్య కారణం గ్రామీణ డిమాండ్ బలపడటం. తక్కువ వడ్డీ రేట్లు, పెరిగిన ఖర్చు సామర్థ్యం గ్రామీణ ప్రాంతాల్లో నగదు వినియోగాన్ని పెంచాయి. అదనంగా, కొన్ని నిత్యావసర వస్తువులపై జీఎస్‌టీ తగ్గింపు కూడా వినియోగానికి మద్దతిచ్చాయని గ్రూప్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ సౌమ్య కాంతి ఘోష్ అన్నారు. అయితే, నగదు వినియోగం పెరగడం వల్ల బ్యాంకింగ్ వ్యవస్థలో ద్రవ్య లభ్యతపై ఒత్తిడి ఏర్పడవచ్చు. ప్రస్తుతం బ్యాంకింగ్ వ్యవస్థలో మిగులు ద్రవ్యం ఉంది. కరెన్సీ చలామణి ఇదే స్థాయిలో కొనసాగితే, ఆర్‌బీఐ ద్రవ్య నిర్వహణకు సవాలు ఎదురవుతుందని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు.

Next Story