- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Wholesale Inflation: నాలుగు నెలల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం
గతేడాది ఆగష్టులో టోకు ద్రవ్యోల్బణం 1.25 శాతం వద్ద ఉంది.

దిశ, బిజినెస్ బ్యూరో: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం ఈ ఏడాది ఆగష్టులో నాలుగు నెలల గరిష్టానికి చేరుకుంది. సమీక్షించిన నెలలో టోకు ద్రవ్యోల్బణం -0.58 శాతం నుంచి 0.52 శాతానికి పెరిగింది. ఆహార పదార్థాలు, వంటనూనె, ముడి పెట్రోలియం-సహజ వాయువు, మెటల్ వంటి ఉత్పత్తుల ధరలు పెరగడమే ఇందుకు నేపథ్యం. ఈ మేరకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ సోమవారం డేటా విడుదల చేసింది. గతేడాది ఆగష్టులో టోకు ద్రవ్యోల్బణం 1.25 శాతం వద్ద ఉంది. ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం జూలైలో -2.15 శాతానికి తగ్గిన తర్వాత గత నెలలో 0.21 శాతానికి పెరిగింది. తయారీ ఉత్పత్తుల ధరలు గత నెలలో 2.05 శాతం తగ్గగా, ఆగష్టులో 2.55 శాతం పెరిగాయి. ఇంధనం, విద్యుత్ ధరలు జూలైలో -2.43 శాతం -3.17 శాతానికి మరింత క్షీణించాయి. గతవారం విడుదలైన ప్రభుత్వ డేటాలో ఆగష్టు నెలకు సంబంధించి రిటైల్ ద్రవ్యోల్బణం 2.07 శాతం పెరిగింది.






