- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Wholesale Inflation: 11 నెలల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం
ఇంధన ధరలు గరిష్ఠ స్థాయిల వద్దే కొనసాగుతుండటం కూడా ప్రభావితం చేశాయి.

దిశ, బిజినెస్ బ్యూరో: కొత్త బేస్ ఇయర్ సిరీస్‌లో భాగంగా ప్రభుత్వం విడుదల చేసిన టోకు ధరల సూచీ(డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం వరుసగా రెండో నెలా పెరిగింది. సోమవారం విడుదలైన ప్రభుత్వ గణాంకాల ప్రకారం, ఈ ఏడాది ఫిబ్రవరిలో టోకు ద్రవ్యోల్బణం 11 నెలల గరిష్ఠ స్థాయి 2.13 శాతానికి చేరింది. కూరగాయల ధరలు కొంత తగ్గినప్పటికీ మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ పరిస్థితుల కారణంగా అంతర్జాతీయ ధరలు పెరగడం, తయారీ వస్తువులతో పాటు ఇతర కమొడిటీలపై ఒత్తిళ్లతో సమీక్షించిన నెలలో టోకు ద్రవ్యోల్బణం పెరిగింది. ఇంధన ధరలు గరిష్ఠ స్థాయిల వద్దే కొనసాగుతుండటం కూడా ప్రభావితం చేశాయి. అంతకుముందు జనవరిలో డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం 1.81 శాతంగా నమోదైన సంగతి తెలిసిందే. గత నెలలో ప్రధానంగా తయారీ ఉత్పత్తులు మొత్తంగా టోకు ద్రవ్యోల్బణం పెరుగుదలకు కారణమయ్యాయి. మిగిలిన వాటిలో ఆహార ఉత్పత్తులు, టెక్స్‌టైల్ తయారీలో ధరలు ఖరీదవడం కూడా కారణం.






