- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Unemployment Rate: 5 శాతానికి పెరిగిన నిరుద్యోగ రేటు
ఈ ఏడాది జనవరి నెలకు సంబంధించి దేశంలో నిరుద్యోగ రేటు 4.8 శాతం నుంచి 5 శాతానికి పెరిగింది.

దిశ, బిజినెస్ బ్యూరో: పనిచేసే అవకాశం ఉన్న 15 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న వ్యక్తుల్లో నిరుద్యోగ రేటు స్వల్పంగా పెరిగింది. గణాంకాలు, పథక అమలు మంత్రిత్వ శాఖ సోమవారం విడుదల చేసిన కార్మిక సర్వే (పీఎల్‌ఎఫ్‌ఎస్) డేటా ప్రకారం, ఈ ఏడాది జనవరి నెలకు సంబంధించి దేశంలో నిరుద్యోగ రేటు 4.8 శాతం నుంచి 5 శాతానికి పెరిగింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో రెండు చోట్లా నిరుద్యోగం పెరగడమే ఇందుకు కారణం. గ్రామీణ నిరుద్యోగ రేటు 4.2 శాతంగా ఉంది. అంతకుముందు డిసెంబర్‌లో ఇది 3.9 శాతం ఉంది. పట్టణ నిరుద్యోగ రేటు 6.7 శాతం నుంచి 7.0 శాతానికి పెరిగింది. ఉపాధి రంగంలో మహిళల భాగస్వామ్య రేటు గ్రామీణ ప్రాంతాల్లో 39.7 శాతం, పట్టణ ప్రాంతాల్లో 25.5 శాతంగా ఉంది. శీతాకాలంలో గ్రామీణ ఉపాధి అవకాశాలు తగ్గడం వల్లనే మొత్తం నిరుద్యోగం పెరగడానికి కారణమని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రధానంగా వ్యవసాయ రంగంలో పంట కోతల తర్వాత ఏర్పడిన విరామం, నిర్మాణ రంగం వంటి పనులు శీతాకాలంలో మందగించడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగం పెరిగిందని వెల్లడించింది.






