- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
SBI Report: అమెరికాతో భారత వాణిజ్య మిగులు 90 బిలియన్ డాలర్లు దాటవచ్చు
ప్రధానంగా ఎగుమతుల్లో గణనీయమైన పెరుగుదల, అధిక దిగుమతి సామర్థ్యం కారణమని అభిప్రాయపడింది

దిశ, బిజినెస్ బ్యూరో: అమెరికాతో భారత వాణిజ్య మిగులు ఏటా 90 బిలియన్ డాలర్ల(మన కరెన్సీలో రూ. 8.15 లక్షల కోట్ల)ను దాటవచ్చని ప్రభుత్వ రంగ దిగ్గజం ఎస్‌బీఐ నివేదిక తెలిపింది. ఇందుకు ప్రధానంగా ఎగుమతుల్లో గణనీయమైన పెరుగుదల, అధిక దిగుమతి సామర్థ్యం కారణమని అభిప్రాయపడింది. భారత్ ఇప్పటికే అమెరికాతో వాణిజ్య మిగులును కలిగి ఉంది. 2024-25లో ఈ మిగులు 40.9 బిలియన్ డాలర్లు (రూ. 3.70 లక్షల కోట్లు) ఉండగా, 2025-26లో ఇప్పటికే ఏప్రిల్-డిసెంబర్ కాలానికి 26 బిలియన్ డాలర్లు (రూ. 2.35 లక్షల కోట్లు)గా ఉంది. ఎగుమతులు మరింత పెరిగితే, ఈ మిగులు ఏటా 90 బిలియన్ డాలర్ల (రూ. 8.15 లక్షల కోట్ల)ను మించవచ్చు. ఇండియా-యూఎస్ వాణిజ్య ఒప్పందం జరిగిన ఏడాదిలోపు ఇది సాధ్యమవుతుందని నివేదిక అంచనా వేస్తోంది. అంటే, భారత్ అమెరికాకు ఎగుమతులను గణనీయంగా పెంచడం ద్వారా వాణిజ్య మిగులు ఏర్పడుతుంది.
ఎగుమతులు, దిగుమతులు
భారతీయ ఎగుమతిదారులు తమ టాప్-15 ఉత్పత్తుల ఎగుమతులను ప్రస్తుతం ఉన్న స్థాయిల నుంచి దాదాపు 97 బిలియన్ డాలర్ల (రూ. 8.78 లక్షల కోట్లు) వరకు పెంచుకునే అవకాశాలు ఉన్నాయని నివేదిక అంచనా వేస్తోంది. మిగిలిన ఉత్పత్తులను కలుపుకుంటే, ఇది ఏటా 100 బిలియన్ డాలర్ల (రూ. 9.60 లక్షల కోట్లు) ఎగుమతి సామర్థ్యం పెరిగేందుకు వీలుంది. దిగుమతుల విషయంలో, భారత్ రాబోయే ఐదేళ్లలో 500 బిలియన్ డాలర్ల (సేవలను మినహాయించి) అమెరికా వస్తువులు కొనుగోలు చేయాలని భావిస్తోంది. అంటే ఏటా 100 బిలియన్ డాలర్ల దిగుమతులు అని అర్థం. ఎగుమతులు, దిగుమతుల కంటే అత్యధికంగా పెరగడం వల్ల వాణిజ్య మిగులు పెరుగుతుంది. నివేదిక ప్రకారం, ఈ మిగులు మనదేశ జీడీపీకి దాదాపు 1.1 శాతం సహకారం అందిస్తుంది. అంటే, దేశ జీడీపీకి అదనంగా 1.1 శాతం బూస్ట్ రావచ్చు, ఇది ఆర్ధిక వృద్ధికి సానుకూలమని నివేదిక వివరించింది.
అమెరికా మార్కెట్ - అవకాశాలు
ప్రస్తుతం, భారత్ ఎగుమతులలో అమెరికా వాటా 20 శాతం, దిగుమతుల్లో కేవలం 7 శాతం మాత్రమే ఉంది. సేవల దిగుమతులలో, 15 శాతం మాత్రమే అమెరికా నుంచి వస్తుంది. దీనర్థం అమెరికాకు ఇప్పటికీ భారత్ అతిపెద్ద మార్కెట్‌గానే ఉందని నివేదిక పేర్కొంది.






