- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Trade Deficit: పెరిగిన భారత వాణిజ్య లోటు

దిశ, బిజినెస్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ నిర్ణయాలతో ప్రపంచ వాణిజ్యం అతలాకుతలం అయింది. దీని ఫలితంగా గత నెల భారత వాణిజ్య లోటు ఫిబ్రవరిలో నమోదైన మూడేళ్ల కనిష్టం 14.05 బిలియన్ డాలర్ల(రూ. 1.20 లక్షల కోట్ల) నుంచి ఒక్కసారిగా 21.54 బిలియన్ డాలర్ల(రూ. 1.84 లక్షల కోట్ల)కు పెరిగింది. వాణిజ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, సమీక్షించిన నెలలో ఎగుమతులు 41.97 బిలియన్ డాలర్లు(రూ. 3.60 లక్షల కోట్లు)గా నమోదయ్యాయి. ఇది ఫిబ్రవరిలో ఎగుమతి అయ్న 36.91 బిలియన్ డాలర్ల(రూ. 3.16 లక్షల కోట్ల) కంటే 13 శాతం అధికం. ఇదే సమయంలో దిగుమతులు అంతకుముందు నెలలో 50.96 బిలియన్ డాలర్లు(రూ. 4.36 లక్షల కోట్ల) నుంచి 26.5 శాతం అధికంగా మార్చిలో 64.51 బిలియన్ డాలర్ల(రూ. 5.53 లక్షల కోట్ల)కు చేరాయి. ఏడాది ప్రాతిపదికన కూడా దిగుంతులు 2024లో కంటే 11 శాతం పెరిగాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ ఏడాది వాణిజ్య కార్యకలాపాలకు క్లిష్టమైన ఏడాదిగా ఉండనుంది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, దీనివల్ల సముద్ర మార్గాల్లో సరఫరాపై ప్రభావం చూపనుండటం, మాంద్యం భయాల కారణంగా వాణిజ్యం ప్రతికూలంగా ఉంటుందని వాణిజ్య కార్యదర్శి సునీల్ బర్త్వాల్ చెప్పారు. అయితే, ఇతర దేశాలతో పోల్చినపుడు భారత్ మెరుగైన పనితీరు చూపుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.