- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Trade Deficit: మళ్లీ పెరిగిన భారత వాణిజ్య లోటు
దిగుమతులు కూడా 8.6 శాతం అధికంగా 64.59 బిలియన్ డాలర్లు(రూ. 5.66 లక్షల కోట్ల)కు చేరాయి

దిశ, బిజినెస్ బ్యూరో: భారత వాణిజ్య లోటు మరోసారి భారీగా పెరిగింది. వాణిజ్య మంత్రిత్వ శాఖ గురువారం విడుదల చేసిన డేటా ప్రకారం, ఈ ఏడాది జూలై నెలలో భారత వాణిజ్య లోటు 27.35 బిలియన్ డాలర్ల(రూ. 2.4 లక్షల కోట్ల)కు పెరిగింది. అంతకుముందు నెలలో ఇది 18.78 బిలియన్ డాలర్ల(రూ. 1.64 లక్షల కోట్ల)తో నాలుగు నెలల కనిష్టానికి చేరిన సంగతి తెలిసిందే. సమీక్షించిన నెలలో ఎగుమతులు 7.29 శాతం పెరిగి 37.24 బిలియన్ డాలర్ల(రూ. 3.26 లక్షల కోట్ల)కు పెరిగాయి. జూన్‌లో ఇవి రూ. 3.07 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. దిగుమతులు కూడా 8.6 శాతం అధికంగా 64.59 బిలియన్ డాలర్లు(రూ. 5.66 లక్షల కోట్ల)కు చేరాయి. ప్రధానంగా అమెరికా సుంకాల కారణంగా భారత ఎగుమతిదారులు కొంత ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఈ కారణంగానే వాణిజ్యలోటు గణనీయంగా పెరిగిందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. మరోవైపు, 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏప్రిల్-జూలై మధ్య భారత ఎగుమతులు 3.07 శాతం పెరిగి 149.2 బిలియన్ డాలర్ల(రూ. 13 లక్షల కోట్ల)కు చేరుకోగా, దిగుమతులు 5.36 శాతం పెరిగి 244.01 బిలియన్ డాలర్ల(రూ. 21.4 లక్షల కోట్ల)కు చేరుకున్నాయి. సమీక్షించిన మొదటి నాలుగు నెలల్లో వాణిజ్య లోటు 94.81 బిలియన్ డాలర్లు(రూ. 8.30 లక్షల కోట్లు)గా ఉన్నాయి. ప్రపంచ ఆర్థిక అనిశ్చితులు ఉన్నప్పటికీ, భారతీయ వస్తువులు, సేవల ఎగుమతులు మెరుగ్గా ఉన్నాయి. ప్రపంచ ఎగుమతుల వ్కంటే మనదేశ ఎగుమతులు గణనీయంగా పెరిగాయని వాణిజ్య కార్యదర్శి సునీల్ బర్త్వాల్ అన్నారు. ముఖ్యంగా ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్, రత్నాభరణాలు, ఫార్మా, కెమికల్స్ ఎగుమతుల వృద్ధికి మద్దతిచ్చాయని ఆయన పేర్కొన్నారు.






