- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
India: 2033 కల్లా రూ. 1.8 లక్షల కోట్లకు భారత వాణిజ్యం

దిశ, బిజినెస్ బ్యూరో: భారత మొత్తం వాణిజ్య విలువ 2033 నాటికి 1.8 లక్షల కోట్లకు చేరుకోనుందని ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ బీసీజీ నివేదిక తెలిపింది. సంస్థ తాజాగా విడుదల చేసిన వివరాల ప్రకారం, భారత వాణిజ్యం ఏటా 6.4 శాతం వార్షిక వృద్ధి రేటుతో పెరుగుతుందని అంచనా వేసింది. ప్రధానంగా చైనా తర్వాత మెరుగైన సరఫరా వ్యవస్థను విస్తరించగలిగే, తయారీ కేంద్రంగా ఎదిగే సత్తా భారత్‌కు ఉందని కంపెనీలు భావిస్తుండటం ఇందుకు ప్రధాన కారణం. ఇదే సమయంలో తయారీకి ప్రభుత్వం గణనీయంగా ప్రోత్సాహకాలు అందిస్తుండటం, దేశంలో తక్కువ ధరకు శ్రామికశక్తి లభిస్తుండటం, వేగంగా పెరుగుతున్న మౌలిక సదుపాయాలు భారత అవకాశాలను మరింత పటిష్టం చేస్తుందని, ఫలితంగా విదేశీ పెట్టుబడులు, వాణిజ్య సహకారానికి ప్రాధాన్యత కలిగిన దేశంగా భారత్ నిలుస్తుందని నివేదిక అభిప్రాయపడింది. ఇదే సమయంలో అమెరికాతో పోలిస్తే భారత వాణిజ్య వృద్ధి వైవిధ్యంగా ఉంటుంది. అమెరికాలో వచ్చే దశాబ్ద కాలంలో వాణిజ్యం రెట్టింపు కంటే ఎక్కువగా ఉంటుందని, 2033 నాటికి 116 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని బీసీజీ తెలిపింది. ఈ వృద్ధి కారణంగా రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల మధ్య, ప్రత్యేకించి రక్షణ, సాంకేతిక రంగాల్లో రాజకీయ, ఆర్థిక సంబంధాలు ఏర్పడనున్నాయి. ఇక, యూరప్, ఏషియన్, ఆఫ్రికాలతో వాణిజ్యం దాదాపు 80 శాతం పెరుగుతుంది. ముఖ్యంగా జపాన్, మెర్కోసూర్ దేశాలతో భారత వాణిజ్యం దాదాపు రెట్టింపునకు, ఆశ్ట్రేలియా, దక్షిణ కొరియాలతో మూడు రెట్లు పెరుగుతుందని నివేదిక వెల్లడించింది. రష్యాతో వాణిజ్యం గణనీయంగా పెరుగుతుందని నివేదిక అంచనా వేసింది.