ప్రపంచ పాల ఉత్పత్తిలో భారత్ వాటా 33 శాతం ఉండాలి: అమిత్ షా

by Disha Web Desk 17 |
ప్రపంచ పాల ఉత్పత్తిలో భారత్ వాటా 33 శాతం ఉండాలి: అమిత్ షా
X

గాంధీనగర్‌: పాల ఉత్పత్తి రంగంలో భారత్ మరింత వృద్దిని సాధించాలని, 2033-34 నాటికి ప్రపంచ పాల ఉత్పత్తిలో 330 మిలియన్ మెట్రిక్ టన్నులు లేదా 33 శాతం వాటాను సాధించడాన్ని భారత్ లక్ష్యంగా పెట్టుకోవాలని కేంద్ర సహకార మంత్రి అమిత్ షా శనివారం అన్నారు. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ఏర్పాటు చేసిన 49వ పాడి పరిశ్రమల సదస్సులో మాట్లాడిన ఆయన, కేంద్ర, రాష్ట్రాలతో పాటు సహకార సంఘాలు కలిసి భారత్‌ను ప్రపంచ పాల ఉత్పత్తిలో అగ్రగామిగా నిలపాలని అన్నారు. దేశవ్యాప్తంగా పంచాయతీ స్థాయిల్లో రెండు లక్షల కొత్త ప్రాథమిక పాల ఉత్పత్తి కమిటీలను ఏర్పాటు చేయడం ద్వారా రాబోయే కొద్ది సంవత్సరాల్లో ప్రపంచ పాల ఉత్పత్తిలో భారత్ వాటా 33 శాతంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

Also Read..

బ్యాంకులకు కీలక సూచనలు చేసిన ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్


Next Story

Most Viewed