Crude Oil: జనవరిలో 12 శాతం తగ్గిన రష్యా ముడి చమురు దిగుమతులు

by S Gopi |   (  Updated:2026-02-05 02:12:24  IST  )

జనవరిలో భారత్ రోజుకు 12.15 లక్షల బ్యారెల్స్ (బీపీడీ) రష్యా ముడి చమురును దిగుమతి చేసుకుంది.

Crude Oil: జనవరిలో 12 శాతం తగ్గిన రష్యా ముడి చమురు దిగుమతులు
X

దిశ, బిజినెస్ బ్యూరో: జనవరిలో భారత రష్యా చమురు దిగుమతులు తగ్గాయి. అంతకుముందు డిసెంబర్‌లో మొదలైన ఈ తగ్గింపు గత నెలలోనూ కొనసాగింది. పాశ్చాత్య దేశాల ఆంక్షల ఒత్తిడి, యూఎస్-ఇండియా వాణిజ్య చర్చల కారణంగా చమురు శుద్ధి సంస్థలు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవడంతో రష్యా చమురు దిగుమతులు తగ్గుతున్నాయని రాయిటర్స్ తెలిపింది. కెప్లర్ డేటా ప్రకారం, జనవరిలో భారత్ రోజుకు 12.15 లక్షల బ్యారెల్స్ (బీపీడీ) రష్యా ముడి చమురును దిగుమతి చేసుకుంది. ఇందులో నయారా 4.1 లక్షల బ్యారెళ్లు, ఐఓసీ 5.8 లక్షల బ్యారెళ్లు, బీపీసీఎల్ 1.9 లక్షల బ్యారెళ్లు దిగుమతి చేసుకున్నాయి. అయితే అతిపెద్ద చమురు శుద్ధి సంస్థ రిలయన్స్ మాత్రం గత నెలలో రష్యా ముడి చమురును దిగుమతి చేసుకోలేదు. గత డిసెంబర్‌తో పోలిస్తే జనవరిలో భారత రష్యా చమురు దిగుమతులు రోజువారీ ప్రాతిపదికన దాదాపు 12 శాతం తగ్గాయని రాయిటర్స్ పేర్కొంది. డిసెంబర్‌లోనూ చమురు దిగుమతులు దాదాపు 22 శాతం తగ్గి రోజుకు 13.8 లక్షల బ్యారెళ్లకు చేరుకున్న సంగతి తెలిసిందే. భారత్ తన రష్యా చమురు దిగుమతులను ఎంతవరకు తగ్గించుకుంటుందనే విషయం అస్పష్టంగానే ఉన్నప్పటికీ, ఇంకా తగ్గితే రష్యాకు తన ముడి చమురు కోసం ప్రత్యామ్నాయ కొనుగోలుదారులను వెతుక్కోవడం కష్టమే కాకుండా ఖరీదైన అంశం కూడా. అయితే, రష్యా చమురు కొనుగోలును నిలిపివేయమని భారత శుద్ధి సంస్థలకు ప్రభుత్వం చెప్పలేదు. ఇప్పటికే ఉన్న ఒప్పందం ప్రకారం కొనుగోళ్లు పూర్తి చేసేందుకు వైండ్-డౌన్ వ్యవధి అవసరమని చమురు శుద్ధి సంస్థలు చెబుతున్నాయి.

Next Story