Renewable Sector: భారత పునరుత్పాదక ఇంధన లక్ష్యం కోసం రెట్టింపు సామర్థ్యం అవసరం: ఎస్అండ్‌పీ

by S Gopi |

అనుకున్న లక్ష్యం నెరవేరాలంటే వచ్చే ఐదేళ్లు చాలా కీలకం. ప్రస్తుతం దేశంలో 214గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యం ఉంది.

Renewable Sector: భారత పునరుత్పాదక ఇంధన లక్ష్యం కోసం రెట్టింపు సామర్థ్యం అవసరం: ఎస్అండ్‌పీ
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత్ పునరుత్పాదక రంగ ఉత్పత్తిలో 500గిగావాట్ల లక్ష్యాన్ని చేరుకోవాలంటే రెట్టింపు సామర్థ్యాన్ని సాధించే దిశగా పనిచేయాల్సి ఉంటుందని ప్రముఖ ఎస్అండ్‌పీ గ్లోబల్ రేటింగ్స్ తన తాజా నివేదికలో వెల్లడించింది. దీనికోసం 2025-2030 మధ్య కాలంలో భారత్ పునరుత్పాదక ఇంధానానికి సంబంధించి వార్షిక సామర్థ్యాన్ని 50గిగావాట్లతో రెట్టింపు చేయాల్సి ఉంటుంది. అనుకున్న లక్ష్యం నెరవేరాలంటే వచ్చే ఐదేళ్లు చాలా కీలకం. ప్రస్తుతం దేశంలో 214గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యం ఉంది. ఇది గతం కంటే భారీ పెరుగుదల. విదేశీ పెట్టుబడుల ద్వారా సామర్థ్యాన్ని మరింత వేగంగా విస్తరించడానికి వీలవుతుందని నివేదిక అభిప్రాయపడింది. ఇప్పుడిప్పుడే పునరుత్పాదక సంస్థలు, పంపిణీ సంస్థలు పునరుత్పాదక ఇంధనాన్ని స్థిరమైన ఇంధనం కాగలదని నమ్ముతున్నాయి. రెన్యూవబుల్ ఎనర్జీ ట్రాన్స్‌మిషన్, డిస్ట్రిబ్యూషన్ విస్తరణ, సామర్థ్యాన్ని పెంచేందుకు 175 బిలియన్ డాలర్ల(మన కరెన్సీలో రూ. 15 లక్షల కోట్ల)కు పైగా అవసరమని ఎస్అండ్‌పీ గ్లోబల్ రేటింగ్స్ తెలిపింది. కాగా, ఈ ఏడాది తొలి త్రైమాసికానికి పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని పెంచిన రాష్ట్రాల్లో మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక ముందున్నాయి.

Next Story