OTT: 60 కోట్లు దాటిన ఓటీటీ యూజర్లు

by S Gopi |

14.82 కోట్ల మంది వినియోగదారులు యాక్టివ్ పెయిడ్ సబ్‌స్క్రిప్షన్‌లను కొనసాగిస్తున్నారు.

OTT: 60 కోట్లు దాటిన ఓటీటీ యూజర్లు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో ఓటీటీ యూజర్ల సంఖ్య అత్యంత వేగంగా పెరుగుతోంది. తాజాగా మీడియా కన్సల్టింగ్ సంస్థ ఆర్మ్యాక్స్ ఓటీటీ ఆడియన్స్ రిపోర్ట్-2025 ప్రకారం, దేశంలో ఓవర్-ది-టాప్(ఓటీటీ) వీడియో ప్రేక్షకుల సంఖ్య 60.12 కోట్లకు పెరిగింది. ఇది దేశ జనాభాలో 41.1 శాతానికి సమానం. గతేడాది కంటే 10 శాతం అధికం. అంతేకాకుండా 14.82 కోట్ల మంది వినియోగదారులు యాక్టివ్ పెయిడ్ సబ్‌స్క్రిప్షన్‌లను కొనసాగిస్తున్నారు. టీవీలలో ఓటీటీలను వాడుతున్న వారి సంఖ్య 12.92 కోట్ల మంది ఉండగా, గతేడాదితో పోలిస్తే ఈ సంఖ్య 87 శాతం పెరిగింది. ముఖ్యంగా ఈ ఏడాది టీవీలలో ఓటీటీలకు కనెక్ట్ అయిన వారి సంఖ్య అత్యంత వేగంగా పెరిగింది. గతంలో మొబైల్‌లలో ఎక్కువమంది ఓటీటీ యాప్‌లను ఉపయోగించేవారు. ఆ ధోరణి ఇప్పుడు టీవీలలోనూ పెరిగింది. కొత్తగా లాంచ్ అవుతున్న టీవీలలో కస్టమర్లను ఆకట్టుకునేందుకు దాదాపు అన్ని కంపెనీలు ఇన్-బిల్ట్ ఓటీటీ యాప్‌లతో విడుదల చేస్తున్నాయి. ఇదే సమయంలో బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ వినియోగం కూడా పెరుగుతోంది. చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లోనూ కంటెంట్ చూసే వారి సంఖ్య పెరుగుతోంది. ఈ కారణంగానే దేశంలో అత్యంత వేగంగా ఓటీటీల వినియోగం పెరుగుతోందని ఆర్మ్యాక్స్ మీడియా ఫౌండర్, సీఈఓ శైలేష్ కపూర్ పేర్కొన్నారు.

Next Story