- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Stock Market: మూడు నెలల్లో ట్రిలియన్ డాలర్లు పెరిగిన భారత స్టాక్ మార్కెట్లు
కేవలం మూడు నెలల్లో బీఎస్ఈ మార్కెట్ క్యాప్ 20 శాతం పెరిగింది.

దిశ, బిజినెస్ బ్యూరో: భారత స్టాక్ మార్కెట్లు సరికొత్త రికార్డులను నమోదు చేస్తున్నాయి. ఈ ఏడాది మార్చి నెల నుంచి ఇప్పటివరకు మార్కెట్ క్యాప్ 1 ట్రిలియన్ డాలర్లు పెరిగింది. ఇది ప్రపంచంలోని మరే ఇతర మార్కెట్ కూడా సాధించలేదు. ఫిబ్రవరి చివరి నాటికి మదుపర్ల సంపదగా భావించే బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్(బీఎస్ఈ) మొత్తం మార్కెట్ విలువ సుమారు 4.8 ట్రిలియన్ డాలర్లు(రూ. 410 లక్షల కోట్లు)గా ఉంది. అక్కడి నుంచి మార్కెట్ల ర్యాలీ కారణంగా రికార్డు స్థాయిలో జూన్ ప్రారంభం నాటికి 5.8 ట్రిలియన్ డాలర్ల(రూ. 496 లక్షల కోట్ల)కు చేరింది. కేవలం మూడు నెలల్లో బీఎస్ఈ మార్కెట్ క్యాప్ 20 శాతం పెరిగింది. జపాన్, జర్మనీ, హాంకాంగ్ లాంటి దేశాల స్టాక్ ఎక్స్ఛేంజ్‌ల కంటే ఇది చాలా ఎక్కువ. ప్రధానంగా ఈ ఏడాది ఒక్క మార్చి నెలలో భారత ఈక్విటీ మార్కెట్లు 9.4 శాతం పెరిగి 4.39 ట్రిలియన్ డాలర్ల నుంచి 4.8 ట్రిలియన్ డాలర్లకు పెరిగాయి. ఇది 2021, మే తర్వాత అత్యంత వేగవంతమైన నెలవారీ వృద్ధి అని మార్కెట్ నిపుణులు తెలిపారు. ఇదే సమయంలో జర్మనీ 4.9 శాతం, జపాన్ 4.9 శాతం, హాంకాంగ్ 4 శాతం పెరిగాయి. యూఎస్, సౌదీ అరేబియా లాంటి మార్కెట్లు బలహీనపడ్డాయి.
కాగా, బుధవారం ట్రేడింగ్‌లో స్టాక్ మార్కెట్లు తక్కువ లాభాలతో సరిపెట్టాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మద్దతు, దేశీయంగా కీలక ఐటీ షేర్లలో కొనుగోళ్లతో రాణించాయి. ఇదే సమయంలో అమెరికా-చైనా మధ్య సానుకూల వాణిజ్య చర్చలు మదుపర్ల సెంటిమెంట్‌ను పెంచాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 123.42 పాయింట్లు లాభపడి 82,515 వద్ద, నిఫ్టీ 37.15 పాయింట్లు పెరిగి 25,141 వద్ద ముగిశాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో హెచ్‌సీఎల్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, రిలయన్స్ వంటి స్టాక్స్ రాణించాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 85.52 వద్ద ఉంది.






