- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
IIP: నాలుగు నెలల గరిష్ఠానికి పారిశ్రామికోత్పత్తి
తయారీ రంగంలో మెరుగైన పనితీరు కారణంగానే ఈ వృద్ధి సాధ్యమైంది.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ పారిశ్రామికోత్పత్తి వృద్ధి జూలైలో 3.5 శాతంగా నమోదైంది. ఇది 4 నెలల గరిష్ఠం కావడం గమనార్హం. అంతకుముందు జూన్‌లో 1.5 శాతంగా ఉంది. గురువారం కేంద్ర గణాంకాల కార్యాలయం విడుదల చేసిన ఐఐపీ గణాంకాల ప్రకారం, తయారీ రంగంలో మెరుగైన పనితీరు కారణంగానే ఈ వృద్ధి సాధ్యమైంది. సమీక్షించిన నెలలో తయారీ రంగ ఉత్పత్తి 5.4 శాతానికి, మైనింగ్ అత్యధికంగా 7.2 శాతం పెరిగింది. విద్యుదుత్పత్తి స్వల్పంగా 0.6 శాతం మాత్రమే పెరిగింది. మైనింగ్, విద్యుత్ రంగాల పనితీరు బలహీనంగానే ఉన్నప్పటికీ, ఇన్‌పుట్ ఖర్చులు, వినియోగ వస్తువులు తయారీ రంగ వృద్ధికి దోహదపడ్డాయని ఇక్రా చీఫ్ ఎకనమిస్ట్ అదితి నాయర్ అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏప్రిల్-జూలై కాలానికి సంబంధించి మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి 2.3 శాతం పెరిగింది. గతేడాది ఇదే కాలంలో ఇది 5.4 శాతంగా ఉంది. మౌలిక/ నిర్మాణ రంగ ఉత్పత్తుల్లో వృద్ధి 21 నెలల గరిష్ఠ స్థాయి 11.9 శాతానికి పెరిగింది. సిమెంట్, స్టీల్ వంటి నిర్మాణ రంగ ఉత్పత్తులు ఇందుకు ఎక్కువ సహాయపడ్డాయని అదితి నాయర్ పేర్కొన్నారు. రానున్న రోజుల్లో జీఎస్టీ సంస్కరణలు వినియోగానికి మరింత మద్దతిచ్చే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు.






