- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Compact Homes: బడ్జెట్ ఇళ్లకు భారీ డిమాండ్
ఈ ఏడాది మూడో త్రైమాసికానికి సంబంధించి విడుదల చేసిన నివేదికలో.. 1-2 బెడ్‌రూమ్ ఇళ్ల గిరాకీ 54 శాతం పెరిగింది.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా హౌసింగ్ మార్కెట్ కొత్త దశలోకి అడుగుపెడుతోంది. ముఖ్యంగా గత ఐదేళ్ల నుంచి సౌకర్యంగా ఉన్న, ప్రీమియం ఇళ్లకు ఎక్కువమంది ఆసక్తి చూపించారు. అయితే, ఇప్పుడు చాలామంది చిన్న ఇళ్లకు అధిక గిరాకీ కనిపిస్తోందని ప్రముఖ స్థిరాస్తి రంగ కన్సల్టెంట్ సంస్థ మ్యాజిక్‌బ్రిక్స్ ప్రాప్ ఇండెక్స్ నివేదిక తెలిపింది. ఈ ఏడాది మూడో త్రైమాసికానికి సంబంధించి విడుదల చేసిన నివేదికలో.. 1-2 బెడ్‌రూమ్ ఇళ్ల గిరాకీ 54 శాతం పెరిగింది. ముఖ్యంగా మెట్రో ప్రాంతాల్లో ఆస్తి ధరలు కొత్త గరిష్టాలకు చేరినప్పటికీ, సింగిల్, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కొనుగోళ్లకు ఆసక్తి పెరిగింది. అత్యధికంగా పూణెలో 41.4 శాతం, ముంబైలో 29.6 శాతం, ఢిల్లీలో 10.3 శాతం అధిక డిమాండ్ కనిపించింది. అధిక వడ్డీ రేట్లు ఉన్న నేపథ్యంలో ఇళ్ల కొనుగోలుదారులు బడ్జెట్ ఇళ్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.
అయితే, దేశవ్యాప్తంగా కొత్త నిర్మాణాల సరఫరా కేవలం 1 శాతం మాత్రమే పెరిగినప్పటికీ, మొత్తం ఇళ్ల డిమాండ్ 3.1 శాతంగా ఉంది. పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చులు, ప్రాజెక్ట్ అప్రూవల్ విషయంలో డెవలపర్లకు ఆలస్యం కావడం ఇందుకు కారణమని నివేదిక అభిప్రాయపడింది. ఆసక్తికరంగా ఇప్పటికే నిర్మాణం పూర్తయి రెడీ-టూ-మూవ్ ఇళ్ల ధరల కంటే నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల ధరలు అత్యధికంగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా సగటు ఇది 16 శాతం ఉంది. భవిష్యత్తులో పెరగబోయే ధరలు, సాధారణ సదుపాయాలు లభిస్తాయనే కారణాలతో నిర్మాణంలో ఉన్న ఇళ్లకు డిమాండ్ పెరుగుతోందని నివేదిక పేర్కొంది.






