- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
UN: ఈ ఏడాది భారత వృద్ధి 6.6 శాతానికి పడిపోవచ్చు: ఐక్యరాజ్యసమితి
వృద్ధి నెమ్మదించినప్పటికీ, ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థికవ్యవస్థలలో ఒకటిగా కొనసాగనుంది.

దిశ, బిజినెస్ బ్యూరో: భారత అర్థికవ్యవస్థ వృద్ధి అంచనాలను ఐక్యరాజ్య సమితి భారీగా తగ్గించింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక ఒత్తిళ్లు, అస్పష్టమైన విధానాలా కారణంగా ప్రపంచ ఆర్థిక పరిస్థితుల్లో సవాళ్లు ఉన్నందున, భారత జీడీపీ వృద్ధి 2026లో 6.6 శాతానికి మందగించే అవకాశం ఉందని ఐక్యరాజ్యసమితి గురువారం తన నివేదికలో తెలిపింది. అయితే, వృద్ధి నెమ్మదించినప్పటికీ, భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థికవ్యవస్థలలో ఒకటిగా కొనసాగనుంది. దేశీయ గిరాకీ, ప్రభుత్వం నుంచి బలంగా ఉన్న పెట్టుబడులు, తక్కువ వడ్డీ రేట్లు ఆర్థిక కార్యకలాపాలకు ఇందుకు మద్దతిస్తాయని భావిస్తున్నట్టు ఐక్యరాజ్యసమితి అభిప్రాయపడింది. నివేదిక ప్రకారం, భారతీయ ఉత్పత్తులపై అమెరికా విధించిన అధిక సుంకాలు కొన్ని రంగాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే, కీలకమైన ఎగుమతులు పెద్దగా ప్రభావితం కాకపోవచ్చు. ఎందుకంటే, ఇతర ప్రధాన మార్కెట్ల నుంచి బలమైన డిమాండ్ ఈ ప్రభావాన్ని పాక్షికంగా భర్తీ చేస్తాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం భారత్‌కు చెందిన ఉత్పత్తులపై 50 శాతం టారిఫ్ విధించిన సంగతి తెలిసిందే. తాజాగా, రష్యా చమురు కొనుగోళ్లు కొనసాగిస్తున్న కారణంతో ఈ సుంకాన్ని 500 శాతానికి పెంచాలని చూస్తోంది.
మరోవైపు, ప్రపంచ ఆర్థిక వృద్ధి కూడా 2026లో 2.7 శాతానికి పడిపోతుందని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. వివిధ దేశాల్లోని అంతర్గత సమస్యలు, దేశాల మధ్య ఉద్రిక్తతలు, సాంకేతికత మార్పులు ప్రపంచ ఆర్థిక వృద్ధిని ప్రభావితం చేస్తున్నాయి. ఈ పరిణామాలు మానవ జీవితాల్లో కొత్త సమస్యలకు కారణమవుతున్నాయి, సామాజిక ప్రమాదాలను పెంచుతున్నాయని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ తెలిపారు. అనేక అభివృద్ధి చెందుతున్న దేశాలు ఇప్పటికీ ఇబ్బందులు పడుతున్నాయి, కాబట్టి ప్రపంచ అభివృద్ధి లక్ష్యాలు నెరవేరడం లేదు. వాణిజ్య మార్పులు, అధిక ధరలు, వాతావరణ సమస్యలను పరిష్కరించేందుకు దేశాల మధ్య బలమైన సహకారం అవసరమని నివేదిక స్పష్టం చేసింది. అయితే పెరుగుతున్న ప్రపంచ ఉద్రిక్తతలు, అంతర్గతంగా చూసే విధానాలు దీన్ని మరింత కష్టతరం చేస్తున్నాయని పేర్కొంది.






