Ind-Ra: దేశ జీడీపీ వృద్ధి అంచనాలను పెంచిన ఇండ్-రా

by S Gopi |

ప్రపంచ వృద్ధి, వాణిజ్యంపై అమెరికా సుంకాల పెంపు పెద్దగా ప్రభావం చూపకపోవడం కూడా కారణమని అభిప్రాయపడింది.

Ind-Ra: దేశ జీడీపీ వృద్ధి అంచనాలను పెంచిన ఇండ్-రా
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి అంచనాలను 7 శాతానికి పెంచుతున్నట్టు ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్(ఇండ్-రా) మంగళవారం ప్రకటనలో వెల్లడించింది. ఇందుకు ప్రధానంగా జూన్ త్రైమాసికంలో అధిక వృద్ధి నమోదవడంతో పాటు ప్రపంచ వృద్ధి, వాణిజ్యంపై అమెరికా సుంకాల పెంపు పెద్దగా ప్రభావం చూపకపోవడం కూడా కారణమని అభిప్రాయపడింది. ఇండ్-రా తాజా అంచనాలు గతంలో ప్రకటించిన 6.3 శాతం కంటే 70 బేసిస్ పాయింట్లు ఎక్కువగా ఉన్నాయి. ఈ ఏడాది జూలై తర్వాత నుంచి దేశీయ, ప్రపంచ పరిణామాల్లో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి. అమెరికా అన్ని దేశాల వస్తువులపై సుంకాలను పెంచడంతో ప్రపంచ ఆర్థికవ్యవస్థ కొన్ని పెద్ద సవాళ్లను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా ఆగస్టు నుంచి భారత్‌పై సుంకాలు చాలా ఎక్కువగా ఉన్నాయి, ఇది ప్రపంచ వాణిజ్యం అనిశ్చితిని సృష్టించింది. అయితే, పలు సానుకూల పరిణామాలు భారత వృద్ధి స్థిరంగా కొనసాగేందుకు దోహదపడుతున్నాయి. ముఖ్యంగా ఊహించిన దానికంటే వేగంగా ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడం, జీఎస్టీ 2.0 సంస్కరణలు కీలకమైనవని ఇండ్-రా చీఫ్ ఎకనమిస్ట్ దేవేంద్ర కుమార్ పంత్ అన్నారు.

Next Story