Economy: అంచనాల కంటే తగ్గిన భారత వృద్ధి

by S Gopi |

ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితుల మధ్య ప్రైవేట్ పెట్టుబడులు తగ్గుముఖం పట్టాయి

Economy: అంచనాల కంటే తగ్గిన భారత వృద్ధి
X

దిశ, బిజినెస్ బ్యూరో: గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికి సంబంధించి భారత స్థూల జాతీయ ఉత్పత్తి(జీడీపీ) వృద్ధి రేటు 7.4 శాతంగా నమోదైంది. ఇది కొవిడ్‌ మహమ్మారి తర్వాత ఈ స్థాయిలో జీడీపీ వృద్ధి నమోదు కావడం ఇదే తొలిసారి. అలాగే, గతేడాది ఇదే త్రైమాసికంలో నమోదైన 8.4 శాతం కంటే తక్కువగా ఉందని శుక్రవారం ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. సమీక్షించిన త్రైమాసికంలో వృద్ధి అంచనాల కంటే పెరిగినప్పటికీ, గతేడాది కంటే తగ్గింది. ఇదే సమయంలో 2024-25 పూర్తి ఆర్థిక సంవత్సరానికి దేశ జీడీపీ నాలుగేళ్ల కనిష్టం 6.5 శాతానికి పరిమితమైందని శుక్రవారం జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ), గణాంక, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో నమోదైన 9.2 శాతంతో పోలిస్తే బాగా క్షీణించింది. వృద్ధి నెమ్మదించినప్పటికీ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థికవ్యవస్థగా భారత్ కొనసాగుతుందని ప్రభుత్వాధికారులు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితుల మధ్య ప్రైవేట్ పెట్టుబడులు తగ్గుముఖం పట్టాయి, అయినప్పటికీ పూర్తి సంవత్సరం వృద్ధి అంచనాల పరిధిలోనే ఉంది. మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో పటిష్టమైన పారిశ్రామిక కార్యకలాపాలు, ప్రపంచ వాణిజ్య ఉద్రిక్తతల నేపథ్యంలో వృద్ధి నాలుగు త్రైమాసికాలలోనూ అత్యంత వేగంగా ఉంది. నాల్గవ త్రైమాసికంలో ట్రంప్ సుంకాలు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం పెరగడం వల్ల ప్రపంచ వాణిజ్యంలో అంతరాయం ఏర్పడింది. అయితే, గ్రామీణ డిమాండ్, ప్రభుత్వ వ్యయం కారణంగా భారత ఆర్థికవ్యవస్థ అంతర్జాతీయ ప్రతికూల పరిణామాలను తట్టుకుంది.

క్యూ4లో మెరుగ్గా వ్యవసాయ రంగం

వ్యవసాయం, అనుబంధ రంగాలు 4.4 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేశాయి. ఇది గత సంవత్సరం ఉన్న 2.7 శాతం కంటే గణనీయంగా పెరిగిందని గణాంకాలు తెలిపాయి. ఆహార పదార్థాలు తగ్గడం, పండుగ సీజన్‌లో ఖర్చులు పెరగడంతో గ్రామీణ డిమాండ్ బలంగా ఉంది. ఫలితంగా ప్రైవేట్ వినియోగ వ్యయం అంతకుముందు ఏడాది ఉన్న 5.6 శాతం నుంచి 7.2 శాతానికి పెరిగింది.

Next Story