Forex Kitty: భారీగా తగ్గిన ఫారెక్స్ నిల్వలు

by S Gopi |

బంగారం నిల్వలు భారీగా తగ్గడం వల్ల మనదేశ విదేశీ మారక ద్రవ్య నిల్వలు 11.413 బిలియన్ డాలర్లు తగ్గి, 698.346 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని ఆర్‌బీఐ తెలిపింది.

Forex Kitty: భారీగా తగ్గిన ఫారెక్స్ నిల్వలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: మనదేశ మారకపు నిల్వలు గణనీయంగా తగ్గాయి. భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) శుక్రవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం, మార్చి 20తో ముగిసిన వారంలో బంగారం నిల్వలు భారీగా తగ్గడం వల్ల మనదేశ విదేశీ మారక ద్రవ్య నిల్వలు 11.413 బిలియన్ డాలర్లు తగ్గి, 698.346 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని ఆర్‌బీఐ తెలిపింది. అంతకు ముందు వారంలో మొత్తం నిల్వలు 7.052 బిలియన్ డాలర్లు తగ్గి, 709.759 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ప్రారంభం కావడానికి ముందు, ఈ ఏడాది ఫిబ్రవరి 27తో ముగిసిన వారంలో ఫారెక్స్ నిల్వలు చారిత్రాత్మక గరిష్ట స్థాయి 728.494 బిలియన్ డాలర్లుగా నమోదైన సంగతి తెలిసిందే. సమీక్షించిన వారంలో విదేశీ కరెన్సీ ఆస్తులు 2.127 బిలియన్ డాలర్లు పెరిగి, 557.695 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. అయితే, ఈ వారంలో బంగారం నిల్వల విలువ అత్యధికంగా 13.495 బిలియన్ డాలర్లు తగ్గి, 117.186 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. స్పెషల్ డ్రాయిన్స్ రైట్స్(ఎస్‌డీఆర్) 65 మిలియన్ డాలర్లు తగ్గి, 18.632 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. అలాగే, ఐఎంఎఫ్ వద్ద భారత నిల్వలు 19 మిలియన్ డాలర్లు పెరిగి, 4.833 బిలియన్ డాలర్లకు చేరాయని ఆర్‌బీఐ డేటా వెల్లడించింది.

Next Story