- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
India Debt: భారత విదేశీ రుణం రూ. 62.95 లక్షల కోట్లు
మొత్తం అప్పులో ఆర్థికేతర సంస్థలు తీసుకున్న అప్పు 261.7 బిలియన్ డాలర్లు(రూ. 22.37 లక్షల కోట్లు) ఉంది.

దిశ, బిజినెస్ బ్యూరో: భారత విదేశీ రుణ భారం ప్రతి సంవత్సరం పెరిగిపోతోంది. గతేడాది చివరికి 668.8 బిలియన్ డాలర్లు (సుమారు రూ.57.17 లక్షల కోట్లు)గా నమోదైంది. ఈ ఏడాది మార్చి నాటికి ఇది 10 శాతం పెరిగి 736.3 బిలియన్ డాలర్ల(రూ. 62.95 లక్షల కోట్ల)కు చేరుకుందని భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) ఓ ప్రకటనలో తెలిపింది. ఆర్‌బీఐ డేటా ప్రకారం, భారత విదేశీ రుణం 2023-24 చివరి నాటికి జీడీపీలో 19.1 శాతానికి పెరిగింది. ఇది గతేడాది ఇదే సమయంలో ఉన్న 18.5 శాతం కంటే స్వల్పంగా పెరిగింది. మొత్తం అప్పులో ఆర్థికేతర సంస్థలు తీసుకున్న అప్పు 261.7 బిలియన్ డాలర్లు(రూ. 22.37 లక్షల కోట్లు) ఉంది. ప్రభుత్వం తీసుకున్న అప్పు 168.4 బిలియన్ డాలర్ల(రూ. 14.4 లక్షల కోట్ల)కు చేరుకుంది. మొత్తం విదేశీ రుణంలో స్వల్పకాలానికి తీసుకున్న మొత్తం (ఏడాదిలోపు మెచ్యూర్ అయ్యే మొత్తం) వాటా మార్చి చివరి నాటికి 18.3 శాతానికి తగ్గింది. ఇదే సమయానికి అమెరికా డాలర్ ఆధారిత రుణం మొత్తం విదేశా రుణంలో 54.2 శాతంతో ఆతిపెద్ద వాటా కలిగి ఉంది. ఆ తర్వాత రూపాయి (31.1 శాతం), యెన్ (6.2 శాతం), ఎస్‌డీఆర్2 (4.6 శాతం), యూరో (3.2 శాతం) ఉన్నాయని ఆర్‌బీఐ పేర్కొంది.






