- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Unemployment: 4.9 శాతానికి దిగొచ్చిన నిరుద్యోగ రేటు
ఈ ఏడాది ఫిబ్రవరి నెలకు సంబంధించి దేశంలో నిరుద్యోగ రేటు 4.9 శాతానికి తగ్గింది.

దిశ, బిజినెస్ బ్యూరో: పనిచేసే అవకాశం ఉన్న 15 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న వ్యక్తుల్లో నిరుద్యోగ రేటు స్వల్పంగా దిగొచ్చింది. గణాంకాలు, పథక అమలు మంత్రిత్వ శాఖ సోమవారం విడుదల చేసిన కార్మిక సర్వే (పీఎల్‌ఎఫ్‌ఎస్) డేటా ప్రకారం, ఈ ఏడాది ఫిబ్రవరి నెలకు సంబంధించి దేశంలో నిరుద్యోగ రేటు 4.9 శాతానికి తగ్గింది. అంతకుముందు నెలలో ఇది 5 శాతంగా నమోదైంది. పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగం దిగిరావడమే ఇందుకు కారణం. సమీక్షించిన నెలలో పట్టణ నిరుద్యోగ రేటు 6.6 శాతానికి తగ్గింది. ఇది గతేడాది డిసెంబర్ నాటి స్థాయి అని పీఎల్ఎఫ్ఎస్ డేటా పేర్కొంది. ఇదే సమయంలో గ్రామీణ నిరుద్యోగం 4.2 శాతంతో స్థిరంగా కొనసాగుతోంది. మహిళల్లో కూడా నిరుద్యోగం 5.6 శాతం నుంచి 5.1 శాతానికి తగ్గింది. ఈ క్షీణత గ్రామీణ, పట్టణ ప్రాంతాలు రెండింటిలోనూ నమోదైంది. ఉపాధి రంగంలో మహిళల భాగస్వామ్య రేటు గ్రామీణ ప్రాంతాల్లో 39.7 శాతం నుంచి 40 శాతానికి, పట్టణ ప్రాంతాల్లో 25.5 శాతం వద్దే ఉంది.






