Exports: జనవరిలో అమెరికాకు 39 శాతం పెరిగిన ఎగుమతులు

by S Gopi |

గత నెల మన దేశం నుంచి అమెరికాకు 8.44 బిలియన్ డాలర్ల(రూ. 73.29 వేల కోట్ల) విలువైన ఎగుమతులు జరిగాయి.

Exports: జనవరిలో అమెరికాకు 39 శాతం పెరిగిన ఎగుమతులు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఈ ఏడాది జనవరిలో అమెరికాకు భారత ఎగుమతులు 39 శాతం పెరిగాయని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గణాంకాల ప్రకారం, గత నెల మన దేశం నుంచి అమెరికాకు 8.44 బిలియన్ డాలర్ల(రూ. 73.29 వేల కోట్ల) విలువైన ఎగుమతులు జరిగాయి. అలాగే, 2024-25 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జనవరి మధ్య కాలంలో అమెరికాకు దేశ ఎగుమతులు 8.95 శాతం పెరిగి 68.46 బిలియన్ డాలర్లు(రూ. 5.95 లక్షల కోట్లు) నమోదయ్యాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో ఎగుమతులు రూ. 5.45 లక్షల కోట్లు)గా ఉన్నాయి. 2021-2024 మధ్య భారత్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా అమెరికా నిలిచింది. ముఖ్యంగా భారత్‌తో వాణిజ్య మిగులు ఉన్న కొన్ని దేశాల్లో అమెరికా ఒకటి కావడం గమనార్హం. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఇరు దేశాల ద్వైపాక్షిక వాణిజ్యం 119.71 బిలియన్ డాలర్లు(రూ. 10.4 లక్షల కోట్లు) జరిగాయి. ఇందులో రూ. 6.73 లక్షల కోట్ల ఎగుమతులు, రూ. 3.66 లక్షల కోట్లు దిగుమతులు ఉన్నాయి. రూ. 3.06 లక్షల కోట్ల వాణిజ్య మిగులుతో భారత్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. ఇటీవలే ఇరు దేశాలు 2030 నాటికి 500 మిలియన్ డాలర్ల వాణిజ్య ఒప్పందాన్ని లక్ష్యంగా చేసుకున్నాయి.

Next Story