Exports: ఆల్‌టైమ్ గరిష్ఠ స్థాయికి ఎగుమతులు

by S Gopi |

మొత్తం వస్తు, సేవల ఎగుమతులు 4.6 శాతం పెరిగి 863.11 బిలియన్ డాలర్ల(రూ. 81.47 లక్షల కోట్ల)తో ఆల్‌టైమ్ రికార్డు గరిష్టానికి చేరాయి

Exports: ఆల్‌టైమ్ గరిష్ఠ స్థాయికి ఎగుమతులు
X

దిశ, బిజినెస్ బ్యూరో: అంతర్జాతీయ వాణిజ్య అనిశ్చితి, భౌగోళిక రాజకీయ పరిణామాల ఒత్తిడి ఉన్నప్పటికీ భారతీయ ఎగుమతులు స్థిరమైన వృద్ధిని నమోదు చేశాయి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొత్తం వస్తు, సేవల ఎగుమతులు 4.6 శాతం పెరిగి 863.11 బిలియన్ డాలర్ల(రూ. 81.47 లక్షల కోట్ల)తో ఆల్‌టైమ్ రికార్డు గరిష్టానికి చేరాయి. ఇది గతేడాది నమోదైన 825.26 బిలియన్ డాలర్లతో పోలిస్తే గణనీయమైన పెరుగుదల అని వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కేవలం వస్తువుల ఎగుమతుల్లో మాత్రమే వృద్ధి మోస్తరుగా ఉంది. 2025-26లో 0.93 శాతం స్వల్ప వృద్ధితో 441.78 బిలియన్ డాలర్ల(రూ. 41.72 లక్షల కోట్ల)కు చేరాయి. ప్రపంచ వాణిజ్యంలో సవాళ్లు ఉన్నప్పటికీ, ఈ ఎగుమతులు స్థిరంగా కొనసాగడం సానుకూల పరిణామమని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఇక, సేవల ఎగుమతులు 8.71 శాతం పెరిగి 421.32 బిలియన్ డాలర్ల(రూ. 39.80 లక్షల కోట్ల)తో రికార్డు స్థాయికి చేరాయి. ముఖ్యంగా ఐటీ సేవలు, బిజినెస్ సొల్యూషన్స్, ప్రొఫెషనల్ సేవలకు గ్లోబల్ డిమాండ్ పెరగడం దీనికి కారణం. ఇది భారత సేవా రంగం ప్రపంచ మార్కెట్లో మరింత బలపడుతున్న సంకేతాలు ఇస్తోందని మంత్రిత్వ శాఖ పేర్కొంది.

Next Story