- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫిబ్రవరిలో 12 శాతం పెరిగిన వంటనూనె దిగుమతులు!
ముడి పామాయిల్ దిగుమతుల్లో గణనీయమైన వృద్ధి కారణంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో వంటనూనె దిగుమతులు గతేడాది కంటే 12 శాతం పెరిగి 10.98 లక్షల టన్నులకు చేరుకున్నాయి.

న్యూఢిల్లీ: ముడి పామాయిల్ దిగుమతుల్లో గణనీయమైన వృద్ధి కారణంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో వంటనూనె దిగుమతులు గతేడాది కంటే 12 శాతం పెరిగి 10.98 లక్షల టన్నులకు చేరుకున్నాయి. ఈ మేరకు పరిశ్రమల సంఘం సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఎస్ఈఏ) బుధవారం ప్రకటించింది. గతేడాది ఇదే నెలలో వంటనూనె దిగుమతులు 9.83 లక్షల టన్నులుగా ఉన్నాయి.
సమీక్షించిన నెలలో నాన్-ఎడిబుల్ ఆయిల్ దిగుమతులు 36,389 టన్నుల నుంచి 16,006 టన్నులకు తగ్గాయి. 2022, నవంబర్ నుంచి 2023, ఫిబ్రవరి మధ్యకాలంలో వంటనూనె దిగుమతులు 45.91 లక్షల టన్నుల నుంచి 58.44 లక్షల టన్నులకు పెరిగాయి. ఇదే సమయంలో నాన్-ఎడిబుల్ ఆయిల్ దిగుమతులు 99,938 టన్నుల నుంచి 43,135 టన్నులకు క్షీణించాయి.
పరిశ్రమల సంఘం ఈ గణాంకాలను నవంబర్ నుంచి అక్టోబర్ మధ్యకాలానికి లెక్కిస్తుంది. కాగా, నాన్-ఎడిబుల్ ఆయిల్ అనేవి వివిధ పరిశ్రమల్లో ఇంధనం, సబ్బు, డిటర్జెంట్, పెయింట్ వంటి వాటిని ఉత్పత్తి కోసం వినియోగిస్తారు.






