- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Economy: 2026లో భారత వృద్ధి రేటు 6.6 శాతం: యూఎన్ నివేదిక
రాబోయే సంవత్సరాల్లో కూడా స్థిరమైన వృద్ధిని కొనసాగిస్తుందని యూఎస్ అనుబంధ సంస్థ ఆసియా-పసిఫిక్ ఆర్థిక, సామాజిక కమిషన్ (ఈఎస్‌సీఏపీ) అంచనా వేసింది.

దిశ, బిజినెస్ బ్యూరో: అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ సవాళ్లు ఉన్నప్పటికీ భారత ఆర్థికవ్యవస్థ మెరుగైన వృద్ధిని కొనసాగిస్తుందని ఐక్యరాజ్యసమితి(యూఎన్) అభిప్రాయపడింది. రాబోయే సంవత్సరాల్లో కూడా స్థిరమైన వృద్ధిని కొనసాగిస్తుందని యూఎస్ అనుబంధ సంస్థ ఆసియా-పసిఫిక్ ఆర్థిక, సామాజిక కమిషన్ (ఈఎస్‌సీఏపీ) అంచనా వేసింది. ఫలితంగా 2026లో భారత్ ఆర్థిక వృద్ధి రేటు 6.4 శాతంగా, 2027లో 6.6 శాతంగా నమోదవుతుందని పేర్కొంది. ద్రవ్యోల్బణం కూడా ఈ ఏడాది 4.4 శాతం, 2027లో 4.3 శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది. నివేదిక ప్రకారం, గ్రామీణ వినియోగం పెరగడం, వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) రేట్ల తగ్గింపు, అమెరికా సుంకాల అమలుకు ముందే ఎగుమతులను వేగవంతం చేయడం వంటి అంశాల కారణంగా 2025లో భారతదేశ వృద్ధి రేటు 7.4 శాతానికి చేరింది. దీంతో నైరుతి, దక్షిణాసియా ప్రాంతం మొత్తం వృద్ధి కూడా పెరిగింది. ముఖ్యంగా గ్రీన్‌ఫీల్డ్ ఎఫ్‌డీఐ పెట్టుబడులను ఆకర్షించడంలో భారత్ ముందంజలో నిలిచింది. 2024లో భారత్ సుమారు 50 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించగా, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, కజకిస్తాన్ తదుపరి స్థానాల్లో నిలిచాయి. మొత్తంగా.. గ్లోబల్ సవాళ్లు, వాణిజ్య ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ, బలమైన వినియోగం, సేవల రంగం, ప్రభుత్వ విధానాల మద్దతుతో భారత ఆర్థికవ్యవస్థ స్థిరమైన వృద్ధి మార్గంలో కొనసాగుతుందని నివేదిక స్పష్టం చేసింది.






