Economy: దేశ బలహీన వృద్ధి రేటు తాత్కాలికమే.. ప్రధాన ఆర్థిక సలహాదారు

by S Gopi |

తద్వారా ప్రపంచ ఐదవ అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా ఎదగనున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.

Economy: దేశ బలహీన వృద్ధి రేటు తాత్కాలికమే.. ప్రధాన ఆర్థిక సలహాదారు
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత వృద్ధి రేటు నెమ్మదించడం తాత్కాలికమేనని, తాజా కేంద్ర బడ్జెట్‌లో రికార్డు స్థాయి పన్ను తగ్గింపులతో వినియోగం పెరుగుతుందని ప్రధాన ఆర్థిక సలహాదారు వి అనంత నాగేశ్వరన్ చెప్పారు. తద్వారా ప్రపంచ ఐదవ అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా ఉన్న మనదేశంలో ప్రైవేట్ పెట్టుబడులు మెరుగుపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు. సోమవారం జాతీయ మీడియాతో జరిగిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. దీర్ఘకాలానికి 6.5 శాతం వృద్ధిని సాధించాలనే లక్ష్యాన్ని నిర్దేశించాం. భౌగోళిక రాజకీయ పరిస్థితులు మారిన తర్వాత మనదేశ వృద్ధి రేటు ఎక్కువగా ఉంటుంది. బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తీసుకున్న చర్యలతో మధ్యతరగతి చేతుల్లో అదనపు సొమ్ము ఉంటుంది, తద్వారా కొనుగోలు శక్తి పెరుగుతుంది. వృద్ధి కోసం ఇతర అంశాలపై ఆధారపడకుండా దేశీయ డిమాండ్‌ను పెంచడం ఒక మార్గమని నాగేశ్వరన్ వివరించారు. పన్ను తగ్గింపు ప్రైవేట్ రంగ సామర్థ్యాన్ని పెంచేందుకు దోహదపడుతుంది. అంతర్జాతీయ పరిణామాలతో ఎదురుగాలులు ఉన్నప్పటికీ 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారగలం. బడ్జెట్‌లో దిగుమతి సుంకాలపై కోత విధించడం ద్వారా దక్షిణాసియా ప్రాంతంలో ఇతర దేశాలతో పోటీ పడే వీలుంటుంది. అదేవిధంగా ప్రపంచ సరఫరాలో భారత స్థానాన్ని మెరుగుపరుస్తాయని నాగేశ్వరన్ పేర్కొన్నారు.

Next Story