- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
IMF: డిజిటల్ సంస్కరణలతో ఎంఎస్ఎంఈల ఉత్పాదకతకు బూస్ట్
డిజిటల్ మార్పులు (ఆన్‌లైన్ సేవలు, సులభమైన అనుమతులు) ఎక్కువగా అమలు చేసిన రాష్ట్రాల్లో ఉన్న వ్యాపారాలు వేగంగా ఎదిగాయి.

దిశ, బిజినెస్ బ్యూరో: భారత్‌లో జరుగుతున్న డిజిటలైజేషన్ సంస్కరణలు సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈలు) పనితీరును గణనీయంగా మెరుగుపరిచాయని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ ఐఎంఎఫ్ తెలిపింది. తాజా విడుదల చేసిన వర్కింగ్ పేపర్‌లో.. డిజిటల్ మార్పులు (ఆన్‌లైన్ సేవలు, సులభమైన అనుమతులు) ఎక్కువగా అమలు చేసిన రాష్ట్రాల్లో ఉన్న వ్యాపారాలు వేగంగా ఎదిగాయి. అదే సమయంలో, ఒక కంపెనీకి మరో కంపెనీకి మధ్య ఉన్న పనితీరు తేడా కూడా తగ్గింది. అంటే, చిన్న కంపెనీలు కూడా పెద్ద కంపెనీల స్థాయిలో పనిచేశాయి. మొత్తంగా, ఈ డిజిటల్ మార్పులు వ్యాపారాలు చేయడానికి అనుకూల వాతావరణాన్ని సృష్టించాయి. తయారీ రంగంలో ఎంఎస్ఎంఈలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. సుమారు 35 శాతం ఉత్పత్తి, 11 కోట్ల ఉద్యోగాలు, 45 శాతంఎగుమతుల్లో వాటా కలిగి ఉన్నాయి. అయితే వీటిలో చాలా సంస్థలు అధికారికంగా నమోదు కానివే ఉన్నాయి. చిన్న సంస్థలకు పరిపాలనా అడ్డంకులు అధికంగా ఉండటంతో, డిజిటలైజేషన్ వంటి సంస్కరణలు వారికి మరింత ప్రయోజనం చేకూర్చాయని అధ్యయనం చెబుతోంది. ఆన్‌లైన్ పన్ను దాఖలు, ఆటోమేటెడ్ అనుమతులు, సింగిల్-విండో క్లియరెన్స్ వంటి చర్యలు సమయం, ఖర్చులను తగ్గించడంతో పాటు పారదర్శకతను పెంచాయని ఐఎంఎఫ్ వెల్లడించింది.






