- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Nirmala Sitharaman: జీఎస్టీ కోతలతో ప్రజల చేతుల్లో రూ. 2 లక్షల కోట్ల నగదు
దేశంలోని 140 కోట్ల మందికి వర్తించేలా అతిపెద్ద నిర్ణయం తీసుకున్నాం.

దిశ, బిజినెస్ బ్యూరో: వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) సంస్కరణల ద్వారా ప్రజల చేతుల్లోకి రూ. 2 లక్షల కోట్లు చేరుతాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. దీనివల్ల ప్రజల చేతిలో ఎక్కువ నగదు ఉంటుందని, అది విచక్షణతో కూడిన ఖర్చుకు అవకాశం కల్పిస్తుందని తెలిపారు. బుధవారం విశాఖపట్నంలో జీఎస్టీ సంస్కరణలపై జరిగిన జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. 99 శాతం వస్తువులు ఇప్పుడు 5 శాతం జీఎస్టీ శ్లాబు కిందకు వచ్చాయి, ఇది మధ్యతరగతి, పేదలకు ఎంతో ప్రయోజనం. దేశంలోని 140 కోట్ల మందికి వర్తించేలా అతిపెద్ద నిర్ణయం తీసుకున్నాం. ఇప్పటికే చాలా రంగాలకు జీఎస్టీ ప్రయోజనాలు అందాయి. 4 శ్లాబులను రెండింటికి తగ్గించాం. 28 శాతం శ్లాబులో ఉన్న సిమెంట్ సహా 90 శాతం వస్తువులను 18 శాతానికి తీసుకొచ్చాం. వినియోగదారులపై పన్ను భారాన్ని తగ్గించడం, ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య లభ్యతను మెరుగుపరిచే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని వెల్లడించారు.
2018లో జీఎస్టీ ఆదాయం రూ.7.19 లక్షల కోట్లు వచ్చాయి, అది 2025 నాటికి రూ.22.08 లక్షల కోట్లకు పెరిగిందని సీతారామన్ అన్నారు. పన్ను చెల్లింపుదారుల సంఖ్య 65 లక్షల నుంచి 1.51 కోట్లకు పెరిగిందన్నారు. ఆత్మనిర్భర భారత్‌కు ఈ జీఎస్టీ కొత్త సంస్కరణలు ఊతంగ మారుతాయని, మహిళల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని శానిటరీ న్యాప్‌కిన్స్‌పై కూడా పన్నును తొలగించాం. యూపీఏ ప్రభుత్వం 30 శాతం ఉన్న వస్తువులను 5 శాతం పరిధిలోకి తీసుకొచ్చామని, అయినా వారు తమనే విమర్శిస్తున్నారని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు.






